ఆరోజుల్లో నేనే సావిత్రి,సావిత్రే నేను…ఆనాటి జ్ణాపకాలను పంచుకున్న సుశీల..!

మహానటి సినిమా మొదట్లో ఒక డైలాగ్ ఉంటుంది..సావిత్రి మీద కథ రాయాలనుకుంటున్నా అండీ అని చాలా నిర్తిప్తంగా సమంతా అంటే…సావిత్రి ఎవరూ..నాకు సావిత్రి తెలీదు.సావిత్రి గారే తెలుసు..పెద్దవాళ్లని అందరూ గౌరవిస్తారు.సావిత్రిని పెద్దవాళ్లూ కూడా గౌరవించాలి అని ఆర్ధ్రతతో కూడిన గొంతులో కొంచెం గంభిరత కలిపి నరేష్ పలికే డైలాగ్ అది..అలాంటి సావిత్రిని ఏమేవ్,ఓసేవ్ అని పిలిచే స్నేహితురాలుందని తెలుసా..ఆవిడే సుశీల..మహానటి సినిమాలో షాలిని పాండే పోషించిన పాత్ర ఈ సుశీల గారిదే..సినిమాలో సావిత్రి గారి బాల్యం ప్రారంభమైందే సుశీల గారి స్నేహం నుండి..వారిద్దరి గురించి,వారి స్నేహం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ..

సావిత్రి,సుశీల స్నేహం ఏడేనిమిదేళ్ల వయసప్పటిది..ఇద్దరూ ఆర్థికంగా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళే. సుశీల వాళ్లది కృష్ణాజిల్లా పామర్రు దగ్గర పెద మద్దాలి. తన ఆరో ఏటే  వాళ్ల నాన్న పోవడంతో బెజవాడ వచ్చి స్థిరపడ్డారు. సావిత్రి వాళ్ళది గుంటూరు జిల్లా చిర్రావూరు. . సావిత్రికూడా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది.కొన్నాళ్ళకు బెజవాడలో పెద్దమ్మ దుర్గాంబ కుటుంబం దగ్గరకు వచ్చారు. వాళ్ళ పెద్దమ్మది ప్రేమవివాహం. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి. ఆయన విజయవాడ దగ్గర మానికొండకు చెందిన గోగినేని వెంకట సుబ్బయ్యనాయుడు వాళ్ళ డ్రైవర్‌. పిల్లలు లేకపోవడంతో వెంకట్రామయ్య వాళ్ళు సావిత్రి అక్క మారుతిని పెంచుకున్నారు.. తీరా సావిత్రి తండ్రి చనిపోవడంతో, బెజవాడ చేరిన సావిత్రి వాళ్ళ కుటుంబాన్ని సాకిందీ, ఆ పైన సావిత్రిని నటిగా తీసుకెళ్ళి, నిలబెట్టిందీ వెంకట్రామయ్యే. అంత చేసిన ఆ పెదనాన్ననే సావిత్రి ‘నాన్న గారూ’ అని పిలిచేది…సావిత్రి బాల్యం గురించి,తనకు అక్క ఉందనే విషయం గురించి మహానటిలో ప్రస్తావన ఉండదు..
చిన్నప్పటి నుంచి కళ్ళు తిప్పుతూ, డ్యాన్స్‌ చేస్తూ  ఉత్సాహంగా ఉండే సావిత్రికీ, సుశీలకు  స్నేహం డ్యాన్స్‌ క్లాసులోనే మొదలైంది. అది 1944 ప్రాంతం.ఇద్దరూ ఒకే గురువు (హరికథలు, కూచిపూడి భాగవతాల్లో దిట్ట శిష్టా ్ల పూర్ణయ్యశాస్త్రి) గారి దగ్గర నాట్యం నేర్చుకున్నారు. వయసులో సుశీల కన్నా సావిత్రి 10 నెలలు పెద్ద. కానీ, డ్యాన్సు క్లాసులో మాత్రం సావిత్రి కన్నా సుశీల 2నెలల సీనియర్‌.సావిత్రి వాళ్ళమ్మ సుభద్రమ్మకు కుడిచేతికి అరచేయి తప్ప, వేళ్ళు ఉండేవి కావట.దాంతో అన్నీ ఎడమచేతి తోనే చేసేది. అమ్మను చూసి సావిత్రికీ ఎడమచేతి వాటం వచ్చింది. ఎడమ చేతితో రాసేది.సావిత్రి గారికి ఒకఅలవాటుంది  ఎవరైనా ఏదైనా అంటే, తెలియ కుండానే పట్టుదలగా ఎడమచేతి పిడికిలి బిగించడం…ఇదే విషయాన్ని సినిమాలో కీర్తి కూడా అనుకరించిది. తనకు కోపం వచ్చిన సందర్బంలో పిడికిలి బిగించేది..
సావిత్రి గారు సినిమాల్లోకి వెళ్లాక సుశీలను  కూడా సినిమాల్లోకి తీసుకువెళ్ళాలనీ, అవకాశాలిప్పించి నటిని చేసి, తన వెంటే ఉంచుకోవాలనీ చాలాసార్లు అనుకునేవారట. కానీ, పదిహేనేళ్ళకే పెళ్ళయిన  సుశీల గారికి అప్పటికే పిల్లలున్నారు. సుశీల  భర్త పేరు యల్లాజోస్యుల కాశీవిశ్వనాథ్‌ ఆటోమొబైల్‌ రంగంలో ఇంజనీర్‌. సుశీల మద్రాసు వెళ్ళిపోతే, సంసారం దూరమవుతుంది, పిల్లలు అన్యాయమైపోతారని వారించడంతో  విజయవాడలోనే ఉండిపోయారు.దర్శకులు ప్రత్యగాత్మ, కె. విశ్వనాథ్‌, దాసరి, జంధ్యాల లాంటి వాళ్ళు పిలిచి మరీ అవకాశాలివ్వడంతో పాతిక పైగా సినిమాల్లో నటించారు.అవన్ని విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న సినిమాలే.సావిత్రిగారూ మహానటి అయితే ఆవిడ స్నేహితురాలు సుశీల కూడా వల్ల డ్యాన్సు టీచర్‌గా, నాటక, హరికథా కళాకారిణిగా, రేడియో ఆర్టిస్టుగా  చాలా పేరు సంపాదించుకున్నారు.
సావిత్రి ,సుశీల గార్లు ఎదురు పడితే మాటాడుకునే మాటలేంటో తెలుసా.. నేనింకా గుర్తున్నానటే అని సావిత్రి గారంటే..నువ్ ఇంత పెద్దదానివైనా నన్ను మర్చిపోలేదా అని కళ్లనీళ్లతో సుశీల గారనడం..విజయవాడ ఎప్పుడొచ్చినా సుశీల గారిని పిలిపించుకుని మాట్లాడేవరకు వెళ్లేవారు కాదట సావిత్రి గారూ.విజయవాడలోని మమతా హోటల్లో బస చేసి ఎన్నో కబుర్లు చెప్పుకునేవారట.సుశీల గారిని సినిమాల్లోకి తీసుకెళ్లాలని అంత తాపత్రయ పడిన సావిత్రి గారు తన జీవితం ఆకర్లో ఒకసారి సుశీల గారితో ఏమన్నారో తెలుసా…
‘అప్పట్లో నాతో నువ్వు రాలేదని కోపం ఉండేదే. కానీ, నువ్వు మద్రాసు రాకపోవడమే మంచిదైందే. నేను అక్కడకి వెళ్ళాననే కానీ, కోట్లు సంపాదించినా సుఖం లేదు. భర్త పట్టించుకోడు. నాకు తోచింది తినలేను. నచ్చింది కట్టుకోలేను. నేను దిక్కులేని దానినైపోయాను. నువ్వయినా ఇక్కడ సుఖంగా భర్త, పిల్లలతో ఉన్నావ్‌. అంతే చాలు’ అని… ఈ మాటలు విన్న సుశీల గారికి కన్నీళ్లాగలేదట… రాసే నాకు సావిత్రి గారి పరిస్థితి ఒకసారిగా కళ్లముందు కదలాడి కన్నీలాగట్లేదు..

Watch video

Comments

comments

Share this post

scroll to top