ఒకపక్క “మహానటి సావిత్రి” సినిమా రాబోతుంటే…ఆమె కూతురు ఎంత మాట అన్నారో తెలుసా..?

‘‘నాకు 16 ఏళ్ల వయసులో పెళ్లైంది. నా పెళ్లికి రెండేళ్ల ముందే అమ్మ..నాన్నల మధ్య విభేదాలు తలెత్తాయి. వారి మధ్య ఏం జరుగుతోందో.. ఏం గొడవలు వస్తున్నాయో ఆ వయసులో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. అమ్మ..నాన్నలిద్దరూ నాతో ఎప్పుడూ టచ్‌లోనే ఉండేవారు. మా నాన్న ఇంట్లో ఉండకపోయినా.. ఎప్పుడూ ఆయన ఇంటికి నేను వెళుతుండేదాన్ని. ఆ తర్వాతే అసలేం జరుగుతోందో తెలిసేది. వారిద్దరి గొడవల వల్ల ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం చాలా చిన్నవాడైన నా సోదరుడే. అయితే.. అతడు పెరిగి..పెద్దయ్యే నాటికి ఆ గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇక, అమ్మ విషయానికొస్తే..

ఆమె చాలా అమాయకురాలు. తనకొచ్చే ఇబ్బందులను ఎలా డీల్ చేయాలో కూడా ఆమెకు తెలియదు. ఆ తెలివి కూడా ఆమెకు లేదు. ఆమె అమాయకత్వమే ఆమెకు చాలా చెడు చేసింది. ఇక, సరైన గైడెన్స్ కూడా ఆమెకు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ గైడెన్స్ లేక, సమస్యలను ఎదుర్కొనే తెలివి లేక.. మా అమ్మ మద్యానికి బానిసైంది. ఆ తర్వాత దాదాపు 19 నెలలు అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అమ్మ తప్పకుండా బతుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ, మా ఆశలపై నీళ్లుజల్లుతూ ఆమె కన్నుమూసింది. ఆ 19 నెలలు అమ్మను ఆస్పత్రి బెడ్‌పై చూడడం నరకంలా అనిపించింది. ఇక, అమ్మ చివరి రోజుల్లో అమ్మ వెంటే నాన్న ఉన్నారు. ఆ టైంలో నాన్న అనుభవించిన బాధ కూడా అంతా..ఇంతా కాదు. ఇద్దరి మధ్యా ఎన్ని విభేదాలొచ్చినా.. ఆ పరిస్థితుల్లో అమ్మను చూసి చాలా చలించిపోయారాయన. ఆమె చనిపోయాక కూడా మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదు. అమ్మ ఎంత పోగొట్టుకున్నా.. అంతకన్నా ఎక్కువే సంపాదించింది. మా ఆర్థిక స్థితిగతులపై జనం అనుకుంటున్న దానికి భిన్నంగా.. అమ్మ సంపాదనతోనే మేం ఇంకా చాలా జీవితం గడిపేయొచ్చు. అమ్మ చనిపోయాక కూడా ఈ స్థితిలో ఉన్నామంటే అంతా అమ్మ చలవే’’ అని విజయ చాముండేశ్వరి చెప్పారు.

Comments

comments

Share this post

scroll to top