సావిత్రి త‌న సొంత డ‌బ్బుతో క‌ట్టించిన స్కూల్…టీచ‌ర్ల జీతాల కోసం ఆమె ఏం చేసిందో తెలుసా?

నేను రేపల్లె స్టేట్ బ్యాంకు లో 1972 నుండీ 1984 వరకు పని చేసాను . అప్పుడు Correspondent S S G H School వడ్డివారిపాలెం పేర మా బ్యాంకు లో Current Account ఉండేది . S S G H School అంటే శ్రీమతి సావిత్రి గణేశన్ హైస్కూల్ అని అర్ధం. సావిత్రి గారు తన స్వగ్రామములో పేద విద్యార్ధుల సౌకర్యార్ధం స్థాపించిన స్కూల్ అది . కేవలం సావిత్రి గారి ఆర్ధిక సహాయముతోనే స్థాపించబడిన స్కూలు అది .ఆ తర్వాత ప్రభుత్వము వారిచే గుర్తించబడి , కొంత ఆలస్యముగా ప్రభుత్వము వారిచే ఉపాధ్యాయులకు నెలసరి జీతములు విడుదల చేయబడుతూ నడపపడుతున్న స్కూలు అది .

గవర్నమెంటు గ్రాంటు లేకపోతే ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందేవి కావు . వారి స్కూలు తరఫున ఉద్యోగి తమ స్టాఫ్ జీతములందరి చెక్కు మార్చుకొనడానికి మా బ్యాంకుకు వచ్చే వారు . సావిత్రి గారి మీద ఉన్న అభిమానముతో ఆ ఉద్యోగులను పలకరిస్తుండే వాడిని . షుమారు అయిదు నెలలు మా బ్యాంకు తో పని పడక ఆ స్కూలు వారెవరూ మా బ్యాంకు కు రాలేదు .

ఒక రోజు నేను మా బ్యాంకు లో Current Account Counter లో పని చేస్తున్నప్పుడు ఆ స్కూలు ఉద్యోగి సావిత్రి గారి సంతకముతో ఉన్న రూ.104000 /_ రూపాయల మద్రాసు ( ఇప్పుడు చెన్నై ) చెక్కు క్లియరెన్స్ కోసము తమ ఖాతాలో జమ చేయడానికి తీసుకుని వచ్చారు . 1975 ప్రాంతంలో రూ. 104000 /- అంటే ఈ రోజుల్లో షుమారు రూ. 40 లక్షలు పైనే . మామూలుగా ఆ ఖాతాలో గవర్నమెంటు బిల్లు జమ చేయబడ్డాక Correspondent సంతకం చేసిన చెక్కు ద్వారా డబ్బులు Withdraw చేసుకుంటారు . అదీ Regular గా జరిగే Procedure.

దానికి భిన్నంగా సావిత్రి గారి సంతకముతో తమ స్కూలు ఖాతాలో జమ చేయడానికి చెక్కు రావడంతో ఆసక్తి ఆపుకోలేని నేను ” ఇదేమిటి సర్ !! రొటిన్ కు భిన్నంగా సావిత్రి గారి సంతకముతో చెక్కు తెచ్చారు ? ” అని అడిగాను .

దానికి అతను ” ఈ మధ్య సావిత్రి గారు స్కూలు ఎలా నడుస్తోంది ? అని మా Corrspondent గారిని ఫోనులో అడిగారు సర్ . దానికి మా Correspondent గారు అయిదు నెలల నుండీ ప్రభుత్వ గ్రాంటు లేక పని చేసే ఉపాధ్యాయులకు , సిబ్బందికి జీతాలు లేవమ్మా తిండికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పారు. ఆ విషయం విన్న సావిత్రి గారు Correspondent గారిని వెంటనే మద్రాసు రమ్మన్నారు . మా Correspondent గారు వెంటనే మద్రాసు వెళ్ళారు .


సిబ్బందికి అయిదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సావిత్రి గారు ఎంతో కదిలిపోయి తన స్వంత డబ్బులు రూ. 104000 /- మొత్తం అయిదు నెలలు బకాయిలకు చెక్కు రాసిచ్చి ముందు సిబ్బంది బకాయిలు చెల్లించండి. తర్వాత గ్రాంట్ సంగతి మనం చూసుకోవచ్చును అని అన్నారు సర్. ” అని నాకు చెప్పారు . ఇంతకన్నా ఆ మహాతల్లి దాతృత్వానికి నిదర్శనం ఏం కావాలి ?

సావిత్రి గారికి నీరాజనాలతో .

Source:
Rtd Repalle Bank Manager 🙏💐

Comments

comments

Share this post

scroll to top