సావిత్రి యాక్టింగ్ చూడాలంటే కోర్టులో ఆమె విశ్వరూపం చూపిన ఈ సీన్ చూడాల్సిందే..

ఇన్నిరోజులు సావిత్రి అంటే కేవలం ఒక సినిమా నటే అనుకున్నవారికి ఆవిడ గురించి తెలియని ఎన్నో విషయాలు తెలిపింది..ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని కలగించింది  మహానటి సినిమా..ఆ తరం వారు తమ అభిమాన నటిని తెరపై  చూసుకుని మురిసిపోతుంటే, ఈ తరం వారు ఏదో చరిత్రను తెలుసుకుంటున్న ఆనందాన్ని పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు.ఒక పేదింటమ్మాయి సూపర్ స్టార్ గా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచింది..అలాంటి సావిత్రి గురించ,తన నటన గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే..
Image result for svr savithri
ఎక్కడో గుంటూరులో  నాటకాలు వేసుకుంటున్న సావిత్రి పెదనాన్న కెవి చౌదరి ప్రోద్బలంతో సినిమాల్లోకి రంగప్రవేశం చేసింది..మొదటి సినిమా సంసారంలో హీరోయిన్ గా సెలక్ట్ అయినప్పటికి షూటింగ్లో తడబడడంతో సావిత్రి స్థానంలో పుష్పవల్లిని తీసుకున్నారు.ఇందులో హీరోయిన్ గా తీసేసినప్పటికి  కాలేజి స్టూడెంటుగా నటించి కథానాయకుడు అక్కినేనిని చూసి ‘అచ్చం హీరో నాగేశ్వరరావులాగ ఉన్నావే’ అన్న ఒకే ఒక డైలాగ్ చెప్పి ఓహో అనిపించుకుంది…
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మహానటి అనే పేరును సంపాదించుకున్నది.. ఈ తరం వారికి ఆమెవి రెండు మూడు సినిమాలు చూసిన పరిజ్ణానంతో కేవలం ఒక నటిగా మాత్రమే తెలుసు..కానీ కేవలం తన కళ్లతోనే హావభావలు పలికిస్తూ ప్రేక్షకులను కట్టిపడేయగల దిట్ట సావిత్రి..
నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావునే తన నటనతో హడలెత్తించిందని తెలుసా..నటన విషయంలో ఎస్వీరంగారావు ప్రస్తావన వస్తేనే వణుకుపోతారు సినిమా వారు.తన నటన ముందు ఎంతటి హేమాహేమీలైనా తేలిపోతారు.సీన్ కి ముందు డైలాగ్స్ పేపర్స్ చూసుకునే అలవాటు లేని ఎస్వీఆర్ గారు  సావిత్రి గారితో షూటింగ్ అంటే జాగ్రత్తపడేవారట..మంచి మనసులు సినిమాలో న్యాయవాదులుగా ఎస్వీఆర్ ,సావిత్రి పోటాపోటీగా నటించిన  సన్నివేశం చూస్తే సావిత్రి గారి నటనా పటిమ తెలుస్తుంది..
watch video ;

Comments

comments

Share this post

scroll to top