వీధులు శుభ్రం చేసే వ్య‌క్తి క‌ల నెర‌వేర్చిన ఓ కుర్రాడు.!ల‌క్ష‌ల విలువగల బంగారాన్ని కొనిచ్చి మాయం..!

ఈ ఫోటో ల క‌నిపిస్తున్న ముస‌లాయ‌న సౌదీలో వీదులు శుభ్రం చేస్తుంటాడు. ఎంత క‌ష్ట‌ప‌డ్డా తిన‌డానికి త‌ప్ప దాచుకోవ‌డానికి మిగిలే అంత సంపాద‌నైతే కాదు. ఈ వ‌య‌సులో కూడా త‌ను క‌ష్ట‌ప‌డితే త‌ప్ప ఇంట్లో పూడ‌గ‌డ‌వ‌ని పరిస్థితి. కానీ ఆ పెద్దాయ‌న్ని ప్రతిరోజూ ఓ బంగారం దుకాణం విపరీతంగా ఆక‌ర్షించేంది. రోడ్లు ఊడుస్తూ  ఆ దుకాణం రావ‌డ‌మే ఆల‌స్యం  ఆ బంగారు న‌గ‌ల వంకే త‌దేకంగా చూసేవాడు. ఇలా రోజు అక్క‌డికి  రావ‌డం ప‌ని పూర్త‌వ‌గానే బంగారు న‌గ‌ల వంక చూడ‌డం చేసేవాడు. ఈ త‌తంగానంతా దూరం నుంచి ఓ అర‌బ్ కుర్రాడు గ‌మ‌నించాడు.

15310312_1394012877310584_1701496668_n

ఆ ముస‌లాయ‌న ద‌గ్గ‌రకి వ‌చ్చి ఏం చూస్తున్నావ్ తాత అని ప్ర‌శ్నించాడు. ఒక్క‌సారిగా వెన‌క్కి తిరిగిన ఆ పెద్దాయ‌న ఏం లేదు బాబు అంటూ వెళ్ల‌బోయాడు. ప‌ర్వాలేదు పెద్దాయ‌న చెప్పు ఏం చూస్తున్నావు.. ఆ న‌గ‌లు కొంటావా? ఎవ‌రి కోసం కొంటావ్.. మీ భార్య‌క అంటూ ప్ర‌శ్న‌లు సందించాడు ఆ అర‌బ్ అబ్బాయి. లేదు బాబు నా కూతురు కోసం. త‌న‌కు ఇన్నేళ్లేల‌లో ఏమి కొనివ్వ‌లేదు. ఈ బంగారాన్ని కొనిద్దామ‌న్నా అంత తాహ‌త నాకు లేదు. నాకే క‌నుక ఓ కొడుకుంటే నా కూతురుకి ఈ న‌గ‌లు కొనిచ్చే వాడేమో అంటూ క‌న్నీళ్ల‌తో స‌మాదానం ఇచ్చాడు ఆ పెద్దాయ‌న‌. అయితే ఇది నేను కొనిస్తా.. మా చెల్లికి గిఫ్ట్ గా ఈ న‌గ‌ల‌ను ఇస్తున్నా తీసుకొండి. ఇంటికి వెళ్లాక చెప్పండి..  మీ కూతురికి చెప్పండి నీకూ   ఓ అన్న‌య్య ఉన్నాడ‌ని అంటూ ఆ బంగారు న‌గ‌ల‌ని కొనిచ్చాడు ఆ కుర్రాడు. అంతే కాదు కొన్ని డ‌బ్బుల‌ను కూడా ఆ ముస‌లాయ‌న చేతిలో పెట్టి ఇంటికి వెళ్లే ముందు ఏదైనా స్వీట్ ను తీసుకెళ్ల‌డం మ‌ర్చిపోవ‌ద్దు అంటు చెప్పాడు.

15320324_1394012873977251_490184828_n

దీంతో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాక కాసేపు అలాగే నిల్చుండి పోయాడు ముస‌లాయ‌న‌. తేరుకుని చూసే లోపు ఆ కుర్రాడు అక్క‌డ లేడు. బంగారం షాప్ య‌జ‌మానిని అడిగితే ఎటు వెళ్లాడో చూల్లేద‌ని తెలిపాడు. బ‌య‌టికి వెళ్లి ఆరా తీసినా లాభం లేకుండా పోయింది. మ‌న‌సులో ఆ కుర్రాడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు ఆ స్వీప‌ర్. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఎవ‌రో సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో అప్ లోడ్ చేశారు. జ‌రిగిన వివ‌రాల‌ను చెప్పారు. దీంతో ఇప్పుడా ఫోటోలు ఆన్ లైన్ లో వైర‌ల్ అవుతున్నాయి. మమకారపు విలువ తెలిసిన ఆ కుర్రాడిని అందరూ అభినందిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top