“కట్టప్ప” గా చేసిన “సత్యరాజ్” కూతురు ఎవరో తెలుసా..? హీరోయిన్ గా రానుంది చూడండి..!

“సత్యరాజ్” అనడం కంటే “కట్టప్ప” అనడం బెటర్ అనుకుంట. రెండు సంవత్సరాల నుండి మనందరిలో ఉండే కామన్ క్యూస్షన్ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?” సినిమా విడుదలతో మన ప్రశ్నకి సమాధానం దొరికేసింది. బాహుబలికి ముందు “సత్యరాజ్” ఎన్నో చిత్రాల్లో నటించారు. తమిళ్, తెలుగు సినిమాల్లో నటించి ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి సక్సెస్ తో ప్రపంచానికి కూడా పరిచయం అయ్యారు “సత్యరాజ్”.

సత్యరాజ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కుమారుడు ఇప్పటికే తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కూతురు దివ్య సుబ్బయ్య. ఈమెకు నటనపై ఆసక్తి ఉందట. అందుకే ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లలో నటించి తన నటన ప్రతిభను కనబర్చుతూ వచ్చింది. తాజాగా ఈమె వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచాం ద్వారా తెలుస్తోంది. ఈమె తండ్రి సత్యరాజ్‌కు కట్టప్పగా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ రావడంతో ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని దివ్య భావిస్తుంది. అందుకోసం ఆమె ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. కట్టప్ప కూతురు దివ్య సినిమాల్లో రాణిస్తుందా అనేది చూడాలి.

Comments

comments

Share this post

scroll to top