గ్రూప్ కాలింగ్ మాత్రమే కాదు..”వాట్సాప్” లో కొత్తగా రానున్న మరో 2 ఫీచర్స్ ఇవే..! ఇక గ్రూప్స్ లో గాసిప్స్..?

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యూజ‌ర్ల‌కు కొత్త కొత్త ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. దీంతో యూజ‌ర్లు వాటి ప‌ట్ల ఆక‌ర్షితులవుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా వ‌ర‌కు ఫీచ‌ర్ల‌ను వాట్సాప్ అందివ్వ‌గా, త్వ‌ర‌లో మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందించేందుకు వాట్సాప్ సిద్ధ‌మ‌వుతోంది. ఎప్పుడూ కేవ‌లం ఒక‌టి లేదా రెండు కొత్త ఫీచ‌ర్ల‌ను మాత్ర‌మే ప్ర‌వేశ‌పెట్టే వాట్సాప్ త్వ‌ర‌లోమాత్రం అనేక ఫీచ‌ర్ల‌ను అందించేందుకు రెడీ అవుతోంది. మ‌రి వాట్సాప్‌లో త్వ‌ర‌లో రానున్న ఆ ఫీచ‌ర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో మ‌నం కేవ‌లం ఒక వ్య‌క్తికి మాత్ర‌మే వాయిస్ లేదా వీడియో కాల్‌ను చేసుకున్నాం క‌దా. కానీ ఇక‌పై ఏదైనా గ్రూప్‌లో ఉన్న అంద‌రికీ ఒకేసారి గ్రూప్ కాలింగ్ చేసుకోవ‌చ్చు. అంటే.. ఒక గ్రూప్ లో వాట్సాప్ యూజ‌ర్లు మూకుమ్మ‌డిగా ఒకే సారి గ్రూప్ వాయిస్ లేదా వీడియో కాల్‌ను చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఫీచ‌ర్ బ్ర‌హ్మాండంగా ఉంది క‌దా. దీని వ‌ల్ల స్నేహితులు, కుటుంబ స‌భ్యుల గ్రూప్‌ల‌లో ఒకేసారి అంద‌రితో కాల్ చేసి ఎంచక్కా గ్రూప్ కాలింగ్ మాట్లాడ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

ఇక గ్రూప్ కాలింగ్ ఫీచ‌ర్ మాత్ర‌మే కాకుండా వాట్సాప్ గ్రూప్‌ల‌లో త్వ‌రలో ఫేస్‌బుక్‌లో ల‌భించే స్టిక్క‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఇవి వాట్సాప్ గ్రూప్ కేట‌గిరిని బ‌ట్టి ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడున్న కాంటాక్ట్స్ సెర్చ్ ఆప్ష‌న్‌ను తీసేసి దాని స్థానంలో కొత్త‌గా సెర్చ్ ఆప్ష‌న్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. దీంతోపాటు వాట్సాప్ గ్రూప్‌ల‌లో ఉన్న స‌భ్యులు గ్రూప్‌తో సంబంధం లేకుండా ఎవ‌రితో ఎవ‌రైనా ప్రైవేట్ చాటింగ్ చేసుకునేలా ప్రైవేట్ రిప్లై అనే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనున్నారు. అలాగే వాట్సాప్‌లో ఉన్న గ్రూప్ అడ్మిన్ల‌కు స‌భ్యుల‌పై మ‌రింత కంట్రోల్ ఉండే విధంగా కొత్త‌గా ప‌లు ఆప్ష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఇప్పుడు చెప్పిన ఫీచ‌ర్ల‌న్నింటినీ వాట్సాప్ ఇప్ప‌టికే అంత‌ర్గ‌తంగా ప‌రిశీలిస్తోంది. త్వ‌ర‌లో వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచ‌ర్లు ల‌భ్యం కానున్నాయి..!

Comments

comments

Share this post

scroll to top