ఆ హీరోయిన్ ను మూడో పెళ్లి చేసుకుంటున్నారా అని “శరత్ బాబు” ని అడిగితే ఏమన్నారో తెలుసా.? ఎవరామె.?

శరత్ బాబు..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి.సినిమాలు ,సీరియళ్లలో తన నటనతో గుర్తింపు పొందిన నటుడు. .హీరోగా,విలన్ గా,తండ్రి పాత్రలతో పాటు అనేక పాత్రల్లో కనిపించిన విలక్షణ నటుడు..ఆనాటి హీరోల్లో అందగాడిగా గుర్తింపు పొంది అమ్మాయిల మనసు దోచుకున్న నటుడీయన.తెలుగుతో పాటు తమిళ, , కన్నడ సినీ రంగాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.  ఈయన ఇప్పుడు ఒక పడుచు భామతో సహజీవనం చేస్తున్నాడనే వార్తలు షికార్లు చేస్తున్నాయి…

శరత్ బాబు ఇప్పటికి రెండువందల ఇరవై సినిమాల్లో నటించారు..సినీ పరిశ్రమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తొలి రోజుల్లోనే రమాప్రభ ని పెళ్లి చేసుకున్నారు.ఆవిడ అప్పటికే  తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.ఆ తర్వాత శరత్ బాబు స్నేహలతా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.ఆ పెళ్లి కూడా పెటాకులైంది…ఇప్పుడు తాజాగా శరత్ బాబు ఒక నటితో సహజీవనం చేస్తున్నాడని కోలివుడ్ కోడై కూస్తుంది.ఆ నటి ఎవరనుకుంటున్నారు..నమిత..

తెలుసునా తెలుసునా అంటూ తెలుగు తెరకు పరిచయమైన నమిత….బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది బొమ్మ అని కుర్రకారు చేత పాడించిన నమితనే..ఇప్పుడు బొద్దుగా మారిన నమిత ఒకప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో మనకు తెలుసు..బొద్దుగా ఉండడం కూడా అందమే అన్నట్టుంటుంది నమిత విషయంలో..అవకాశాల్లేక చిన్న చిన్న క్యారెక్టర్స్,స్పెషల్ రోల్స్ చేసుకుంటూ గడిపేస్తున్న నమిత,శరత్ బాబు సహజీవనం చేస్తున్నారట,త్వరలో పెళ్లికూడా చేసుకోబోతారట అనే వార్త కూడా వచ్చింది.

ఈ వార్తలను ఖండించారు సీనియర్ నటుడు శరత్ బాబు. కోలీవుడ్ తో మొదలై ఈ రూమర్లు టాలీవుడ్ వరకూ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో శరత్ బాబు స్పందించారు. నమితను తను పెళ్లి చేసుకోబోవడం అనేది కేవలం గాలి కబురు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ముందుకే మీడియాకే చెబుతాను అని శరత్ బాబు స్పష్టం చేశారు. తనపై ఇలాంటి వార్తలను రాసి ఎవరైనా ఉపాధి పొందదలుచుకుంటే అందులో తనకు అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. నమితను తను చివరి సారి చూసింది ఎనిమిదేళ్ల క్రితం అని ఆయన అన్నారు. తామిద్దరం ఒక సినిమాలో కలిసి నటించామని ఆ తర్వాత ఆమెను తను మళ్లీ చూడలేదని అన్నారు. తనకంటూ ఒక క్యారెక్టర్ ఉందని, దానిపై అబద్ధాలు రాసి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.

Comments

comments

Share this post

scroll to top