సరదాగా మెట్రో ఎక్కాలని వెళుతున్నారు…కానీ చివరికి ఫైన్ల భారిన పడుతున్నారు..! ఎందుకో తెలుసా..?

హైదరాబాద్ వాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రారంభమైంది..ప్రధాని మోడి,సిఎం కెసిఆర్ అట్టహాసంగా ప్రారంభించిన మెట్రో సేవలు ఇక సామాన్య ప్రజలు వినియోగించుకోవచ్చు..ట్రాఫిక్,కాలుష్యం అన్ని సమస్యలకు చెక్ పెట్టి..గాల్లో తేలినట్టుందే అనే ప్రయాణం చేయడానికి నగరవాసులందరూ ఉవ్విళ్లూరుతున్నారు…కానీ మెట్రో ఎక్కేముందు కొన్ని రూల్స్ పాటించాలి..లేదంటే కఠిన శిక్షలు తప్పవు…

సిటీబస్,రైలు ప్రయాణాల మాదిరిగా మెట్రో ప్రయాణం చేస్తామంటే కుదరదు.మధ్యం తీసుకున్నా,కింద కూర్చున్న,ఎక్కువ టైం స్పెండ్ చేసినా ,ఇలా ప్రతిదానికి శిక్ష లేదంటే జరిమానా ఉంది…కానీ చాలామంది తెలియక చేస్తున్న పొరపాటు వలన భారీగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది..ఇంతకీ ఆ పొరపాటు  ఏంటంటే..

దేశంలోనే అతి పెద్ద మెట్రో స్టేషన్‌గా అమీర్ పేట్ కి ఇప్పటికే గుర్తింపు వచ్చింది.హైదరాబాద్ మెట్రోలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ కీలకమైనది. అమీర్‌పేట కేంద్రంగానే రెండు మార్గాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రెండు వేర్వేరు కారిడార్లను కలిపే ఈ స్టేషన్‌లో ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించొచ్చు. అమీర్పేట్ స్టేషన్లో చేసే చిన్న పోరపాటు వలనే భారీగా జరిమానా కడుతున్నారు..నాగోల్ నుండి మియాపూర్ కి ఒకే ట్రెయిన్ లేదు..నాగోల్ నుండి అమీర్ పేట్ వచ్చాక అక్కడ వేరే ట్రెయిన్ కి చేంజ్ అయ్యి మియాపూర్ కి వెళ్లే ట్రెయిన్ ఎక్కాలి..నాగోల్ నుండి మియాపూర్ కి ఒకే టికెట్ తీసుకున్నప్పటికీ కూడా అమీర్ పేట్ లో టికెట్ మార్చుకోవాలి..అలా మార్చుకోకుండా డైరెక్ట్ వేరే ట్రెయిన్ ఎక్కేయడం వలన మియాపూర్లో జరిమానా కట్టక తప్పట్లేదట..అంతేకాదు స్మార్ట్ కార్డ్ ఉన్నవారు కూడా అమీర్ పేట్ లో కార్డ్ స్వైప్ చేయాల్సుంటుంది..అలా చేయకపోతే మీక్కూడా ఫైన్ తప్పదు..కాబట్టి మెట్రో  ఎక్కేప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకుని వెళితే బెటరేమో..ఎందుకంటే ఇప్పటికీ చాలా రకాల ఫైన్స్ వసూలు చేస్తున్నారు..తస్మాత్ జాగ్రత్తా..

 

Comments

comments

Share this post

scroll to top