సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా.? సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత..ఏమిటి అంటే??

సంక్రాంతి పండుగ అంటే అందరికి ఇష్టం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూర్లు కిటకిటలాడతాయి, పల్లెటూర్లు సంక్రాంతి పండక్కి మెరిసిపోతాయి, ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు పొలాలు, సంక్రాంతి పండగంటే అందరి ఇళ్లల్లో సంతోషాలు.

సంక్రాంతి పండుగ జరుపుకోడానికి కారణం :

సంక్రాంతి పండుగ జరుపుకోడానికి అసలు కారణం మకర సంక్రాంతి రోజున అనగా జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేదే మకర సంక్రాంతి. సంక్రాంతి సమయానికి రైతులకు పంట చేతికి వస్తుంది కనుక వారు సంతోషం లో పండగ చేసుకుంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పండగ అని అంటారు.

మూడు రోజుల పండగ :

భోగి, మకర సంక్రాంతి, కనుమ.. మన తెలుగు ప్రజలు ఈ మూడు రోజులు సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకుంటారు.

భోగి రోజున పాత చీపురులు, పనికిరాని పాత వస్తువులు భోగి మంటలో వేస్తారు, ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే 3:30 – 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికి కూడా భోగి మంటలు వేస్తారు.

మకర సంక్రాంతి నాడు పెద్దలకు బట్టలు పెడతారు, అసలైన పండుగ మకర సంక్రాంతి రోజే జరుపుకుంటారు. పండుగ నాడు రకరకాల పిండి వంటలు చేస్తారు. అరిసెలు, ఓళిగలు… ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయ్, కుటుంబమంతా ఒక చోట చేరి కలిసి తిని సంతోషంగా గడుపుతారు.

కనుమ నాడు రైతులు వసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు కనుమ పండగ. కనుమ నాడు తెలుగు రాష్ట్రాల్లోని జనాలు మాంసం తింటారు, మాంసహారం తినని వారు మినుము కలిసిన పదార్థాలు తింటారు. కనుమ నాడు మినుము కచ్చితంగా తినాలని అంటారు.

పందాలు పందాలు .. :

సంక్రాంతి పండుగ అంటే చాలు కోడి పందాలు గుర్తొస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం కోడి పందాలను నిషేధించినా, కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అప్పుడు కచ్చితంగా జరుగుతాయి.

సంక్రాంతి పండుగకి ముగ్గులు ప్రత్యేక ఆకర్షణ, ఒకరికొకరు పోటీ పడి మరి ముగ్గులు వేస్తారు వారి వారి ఇంటి ముందు, ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు సంక్రాంతికి.

సంక్రాంతికి పతంగులు ఎగరవేసే చిన్నారుల సంఖ్య ఎక్కువ. పిల్లోళ్లతో కలిసి పెద్ద వాళ్ళు కూడా సంతోషంగా పతంగులు ఎగరేస్తారు.

Comments

comments

Share this post

scroll to top