సంక్రాంతికి రానున్న సినిమాల్లో ఏ సినిమాకు ఎక్కువ హైప్ ఉంది.?

ఈ సంక్రాంతి కి రానున్న సినిమాల పైన జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయ్. 2.0 చిత్రం తరువాత జనాలను ఆకట్టుకున్న చిత్రం కె.జి.యఫ్ చిత్రమే, అయితే ఈ రెండు సినిమాలు మినహాయిస్తే ఇటీవల విడుదల అయినా సినిమాలేవీ జనాలను ఆకట్టుకోలేదు, సంక్రాంతికి రాబోతున్న బడా చిత్రాల పైన భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు :

కథానాయకుడు ..నాయకుడు.. :

సంక్రాంతి పందెం లో ముందుగా వస్తున్నారు బాలకృష్ణ, అన్న గారి బయోపిక్ లో అన్నగారి పాత్రలో నటిస్తున్నారు బాలకృష్ణ. నందమూరి తారక రామ రావు గారి పాత్రలో నటించడం అంటే అంత తేలిక కాదు, కానీ కథానాయకుడు చిత్రం ట్రైలర్ చూస్తే అన్న గారి పాత్రకి ప్రాణం పోశారు అనేలా నటించారు బాలకృష్ణ. ఈ సినిమా పైన ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయ్. ఈ చిత్రం జనవరి 9 న విడుదల కానుంది.

ఈ సంక్రాంతి కి స్వీట్ తినిపియ్యబోతున్న రజినీకాంత్.. పేట రా :

ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ తో ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి, కబాలి తరువాత ఆ రేంజ్ ఎక్సపెక్టషన్ తో రాబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం పేట నే. తమిళ్ లో భారీ స్థాయి లో ఈ సినిమా విడుదల అవ్వనుంది. తెలుగు లో కూడా ఈ సినిమా ని భారీ స్థాయి లో విడుదల చెయ్యాలని తెలుగు లో పేట సినిమా హక్కులు కొన్న వారు ప్రయత్నిస్తున్నారు. జనవరి 10 న తెలుగు తమిళ్ హిందీ బాషలలో పేట సినిమా విడుదలకానుంది.

బోయ-చరణ్ మరణ మాస్ :

బోయపాటి సినిమాలు మాస్ కి మరో పేరు, మాస్ లో గట్టి ఫాలోయింగ్ ఉన్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ అనగానే ఈ సినిమా పైన మాస్ వర్గాల్లో అంచనాలు భారీగా పెరిగాయి, మాస్ వర్గాల అంచనాలకు తగ్గట్టు గానే టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమా లో ఫైట్స్ అండ్ ఎమోషన్స్ ఏ సినిమాకు ప్రాణం. జనవరి 11 న వినయ విధేయ రామ చిత్రం మన ముందుకు రానుంది. ఈ చిత్రం తో మెగా పవర్ స్టార్ రాయలసీమ లో రంగస్థలం తో నెలకొల్పిన రికార్డు లను తిరగరాస్తాడని అందరు నమ్ముతున్నారు.

ఫన్ ఏ ఫన్ :

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరో లుగా నటిస్తున్న F2 చిత్రం జనవరి 12 న విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం లో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా జనాలను ఆకట్టుకొనే ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతి కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం.

ఈ నాలుగు సినిమాలు వేటికవే ప్రత్యేకం, అయితే పండక్కి ఫ్యామిలీ మూవీస్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి F2 చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ పక్కా, వినయ విధేయ రామ బీ,సి సెంటర్ లలో దుమ్ము రేపడం ఖాయం. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి లాంటి సిటీ లలో పేట సినిమా పేకాట ఆడేయడం లాంఛనమే. హిట్ టాక్ వస్తే ఇక అన్ని వర్గాలను ఆకర్షించ గలిగే సత్తా అన్నగారి బయోపిక్ కి ఉంది. ఇంకో 10 రోజుల్లో ఏ సినిమా ఎంతమేరకు ఆడుతుందో తెలుస్తుంది.

 

Comments

comments

Share this post

scroll to top