“కత్తి మహేష్ – పవన్” వివాదంలోకి నిన్న “పూనమ్”..ఇప్పుడు మరో హీరోయిన్.! ఏమంటుందో తెలుసా.?

కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ వివాదం గురించి కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంట. గత కొన్ని రోజులుగా టీవీలో ఇదే న్యూస్ చూసి చూసి మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఛానల్ మార్చలేము..ఈ న్యూస్ చూడలేము. ఇటీవలే ఈ వివాదంలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఎంటర్ అయ్యింది. పలు ట్వీట్లు పెట్టి.. ఆపై వాటిని డిలీట్ చేసింది పూనమ్ కౌర్. ఎదపై టాటూతో వివాదం మొదలయ్యింది. కత్తి మహేష్ వేసిన ప్రశ్నలు..లైవ్ ఇంటర్వ్యూలో వివేక్ దెబ్బకు మహేష్ షో వదిలి వెళ్లిపోవడం. ఇది నిన్నటి వరకు జరిగిన సంఘటనలు. ఇప్పుడు తాజాగా ఈ వివాదంలో మరో హీరోయిన్ ఎంటర్ అయ్యింది.

ఈ వివాదంపై స్పందించిన మరో హీరోయిన్ గా నిలుస్తోంది సంజన. తెలుగులో ‘బుజ్జిగాడు’ వంటి సినిమాలో నటించింది ఈమె. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు కానీ.. ఆ మధ్య పవన్ కల్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ లో ఈమె నటించింది. ఆ అనుబంధంతోనే తాజా వివాదంపై ఈమె స్పందించినట్టుగా ఉంది.ఇంతకీ సంజన ఏమంటోందంటే…‘‘కొంతమంది వ్యక్తులకు కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకోలేక పేరు ప్రఖ్యాతులున్న వారిని.. విజేతలుగా నిలిచిన వారిపై రాళ్లేయడం ద్వారా పాపులర్ అవుదామని చూస్తారు. మేమంతా మీతో ఉన్నాం’’అంటూ పవన్ కల్యాణ్ అధికారిక ట్విటర్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ సంజన ట్వీటు పెట్టింది. తద్వారా ఈమె పీకే వర్సెస్ కత్తి మహేశ్ యుద్ధంలో ఇన్ వాల్వ్ అయ్యింది.ఈ ట్వీట్ తో పాటు ఆమె పవన్ కల్యాణ్ తో తను తీయించుకున్న ఫొటోను కూడా పెట్టింది. మరి ఈమె విషయంలో కూడా కత్తి మహేశ్ స్పందిస్తాడా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.

Comments

comments

Share this post

scroll to top