ట్విట్ట‌ర్ లో అడ్డంగా దొరికిపోయిన సానియా మీర్జా.!

సెల‌బ్రిటీలు అన్నాక ఆయా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌నిచేయ‌డం మామూలే. క్రీడాకారులు, సినీ తార‌లు ఎక్కువ‌గా బ్రాండ్ అంబాసిడ‌ర్‌లుగా ఉంటారు. అయితే ఇంత వ‌ర‌కూ ఓకే. కానీ ఇలా ప‌నిచేయ‌డంలో ఏదైనా తేడా జ‌రిగితే అంతే. అప్పుడు అభిమానులే కాదు, ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా అలాంటి సెల‌బ్రిటీల‌ను ఒక ఆట ఆడుకుంటారు. గ‌తంలో నెస్లీ మ్యాగీతోపాటు ఇంకా ఇత‌ర ప్రోడ‌క్ట్స్ విష‌యంలో మ‌నం ఇది చూశాం. అయితే ఇప్పుడలాంటి స్థితినే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎదుర్కొంటోంది. ఇంత‌కీ ఆమె ఏం చేసిందంటే…

వ‌న్ ప్ల‌స్ 3టీ స్మార్ట్‌ఫోన్ తెలుసు క‌దా. వ‌న్ ప్ల‌స్ అనే చైనాకు చెందిన ఓ కంపెనీ స్మార్ట్‌ఫోన్ అది. గ‌త కొద్ది నెల‌ల కింద‌టే ఆ ఫోన్ విడుద‌లైంది. అయితే ఆ ఫోన్ ప్ర‌మోష‌న్ కోసం సానియా స‌ద‌రు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్ర‌మంలో ఆమె తాను ఆ ఫోన్‌ను 3 నెల‌ల నుంచి వాడుతున్నాన‌ని, చాలా బాగుంద‌ని, కావాలంటే మీరూ ఆ ఫోన్‌ను ట్రై చేయండి… అని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ప్ర‌మోష‌న్ పోస్ట్ పెట్టింది. అయితే ఏంటీ… ఎంతో మంది సెల‌బ్రిటీలు ఇలాగే చేస్తున్నారు క‌దా. మొన్న‌టికి మొన్న మాజీ క్రికెట‌ర్ సెహ్వాగ్ చెప్పాడు క‌దా, తాను ట్విట్ట‌ర్‌లో ఇలాగే పోస్టులు పెట్టి నెల‌కు రూ.30 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాన‌ని. మ‌రి సానియా కూడా అలాగే చేసింది. ఇందులో త‌ప్పేముందీ… అంటారా..? అయితే మీరు సానియా ట్వీట్‌ను స‌రిగ్గా చూడ‌లేదు.

ఒక సారి మ‌ళ్లీ ఆ ట్వీట్‌ను ప‌రిశీలించండి. ట్వీట్ కింద కుడి వైపు చూశారా..? ”via Twitter for iPhone” అని ఉంది క‌దా..! అవును అదే..! ఐఫోన్ ను వాడుతున్న వారు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేస్తే అలా క‌నిపిస్తుంది. అదేంటీ… ఆమె తాను 3 నెల‌ల నుంచి వ‌న్ ప్ల‌స్ 3టీ ఫోన్ వాడుతున్నాన‌ని చెప్పింది క‌దా..! మ‌రి ఐఫోన్ నుంచి ట్వీట్ ఎలా చేస్తుంది..? అంటే.. అవును.. ఆమె నిజానికి ట్వీట్ చేసింది ఐఫోన్ నుంచే. కానీ తాను వ‌న్ ప్ల‌స్ 3టీ ఫోన్ నుంచి చేస్తున్న‌ట్టు చెప్పింది అంతే..! ఈ క్ర‌మంలో ఆమెకు పైన చెప్పిన ”via Twitter for iPhone” అని వ‌స్తుంద‌ని తెలియ‌లేదు. దీంతో ఆమె అబ‌ద్దం ఆడిన‌ట్టు దొరికేసింది. ఇంకేముందీ… సానియాను ట్విట్ట‌రీయులు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. ఆమెపై జోకులు పేల్చారు. దీంతో దెబ్బ‌కు ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. అవును మరి, ఏ ప్రొడ‌క్ట్‌కైనా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చేయ‌డం తప్పు కాదు, మ‌రీ ఈ లెవ‌ల్లో అబ‌ద్దం ఆడితే ఎలా..? జ‌నాలు చూస్తూ ఊరుకోరు క‌దా..! ఒక ఆట ఆడుకుంటారు మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top