సానియా నువెక్కడ???

తెలంగాణ రాష్ట్ర  తొలి ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. తొలి సంబురం పేరుతో పెరేడ్ గ్రౌండ్ అంతా ధూమ్ ధామ్ వేదికగా మారిపోయింది. అలాయ్ బలాయ్ లు ఓ దిక్కు,  తెలంగాణ నినాదాలో దిక్కు. అరె అంతా బాగుంది కానీ నా కళ్లు ఒకరిని వెతుకుతున్నాయ్. ఈమె ఇంకా కనబడదేంది. కెసిఆర్ స్పీచ్ గిట్టా స్టార్ట్ అయ్యింది,ఇంకా కనబడదేంది. అసలు అచ్చిందా? రాలేదా..? రాకపోతే  ఎట్టా ఏరికోరి ఆమెను  తెలంగాణ కు బ్రాండ్ అంబాసిడర్ని జేస్తిమి.  పండగ నాడు ప్రజలకు ఇంత విష్ జేయకుంటే ఇజ్జత్ పోదు.

SANIA MIRZA TELANGANA BRAND AMBASIDOR

 

అరె పెద్దసార్ స్పీచ్  గూడ అయిపాయె, జనాలు సప్పట్లు కొట్టబట్టిరి, మీర్జా మేడమెమో ఎక్కడా కానరాకపాయె. అరె గిందుకేనా ఆమెకు బ్రాండ్ అంబాసిడర్ పట్టం కట్టబెట్టింది అని నాబోటోళ్లంతా నోరెల్లబెట్టిన్రు.  అసలు మా కెసిఆర్ సార్ ఆమెకు ఎం తక్కువ జేసిండు.

  • అడగక ముందే తెలంగాణ  బ్రాండ్ అంబాసిడర్ అని నెత్తిన  కిరీటం బెట్టే,
  • కోటి రూపాల చెక్కు చేతిల బెట్టే,
  • BJP లక్ష్మణ్ సార్ ఎంత విమర్శించినా పట్టించుకోకుండా  బరాబర్ నీకే జై అన్నడు.
  • అంతకు మించి ఇంట్ల బిడ్డాలాగా  జూడబట్టే.

 

యెదో  ముఖ్యమైన ఆటల పడి రాలేకపోయావేమో అనుకొన్న. ఎంతలేదన్నా నువ్వు మా బ్రాండ్ అంబాసిడర్వి కదా  ఏదో రకంగా శుభాకాంక్షలు చెప్పినవేమోనని.. నీ ట్విట్టర్ అకౌంట్ జూసిన.? నీ ఫేస్ బక్ అకౌంట్ తెరిసిన.! పొరపాటున  నువ్వేమైన  తెలంగాణ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు  అని  పోస్ట్ గిట్ల జేసినవని. కానీ ట్విట్టర్లో ట్వీట్ లేదు,పేస్ బుక్ లో పోస్టు లేదు.

ఉత్తగా ఆడ పిల్లమీద బద్నాం ఏస్తే ఉసురు తగులుతదని తెలుసు.ఇగ ఇప్పుడు నువ్వుజెప్పు నువ్వు కేవలం నీ చేతిలోని షటిల్ బ్యాట్ కే బ్రాండ్ అబాసిడరా?  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో నీకు సంబంధం లేదా? మీ ఫేస్ బుక్ అకౌంట్ లో  బ్లూ కలర్ డ్రెస్ లో ఓ ఫోజుంది., తీరా ఆరా తీస్తే తెలిసింది ఆవిర్భావ దినోత్సవం నాడు  మీరు మా దగ్గర డుమ్మా కొట్టి పెటా ప్రోగ్రామ్ కి చెక్కేశారని.  మా చదువుకున్న పిల్లలడుగుతుండ్రు.. మనుషుల కన్నా మీకు అ కుక్కపిల్లలెక్కువయ్యాయా అని.

SANIA MIRZA

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top