నువ్వు భారతీయురాలివి కావన్నందుకు సానియా మీర్జా ఆ వ్యక్తికి ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా..?

గత జనవరి నెలలో జమ్మూ కాశ్మీర్‌ కతువాలో 8 ఏళ్ల బాలికపై కొందరు వ్యక్తులు జరిపిన దారుణ రాక్షసకాండ గురించి అందరికీ తెలిసిందే. అభం శుభం తెలియని చిన్నారిని పాశవికంగా ఆ మృగాళ్లు రేప్‌ చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు పాల్పడన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే నిందితులను విడుదల చేయాలంటూ ఆ రాష్ట్ర అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, చివరకు కొందరు న్యాయవాదులు కూడా ఈ మధ్య అక్కడ ర్యాలీలు తీశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ విషయంపై పెద్ద వివాదమే చెలరేగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలి అని అడగాల్సిందిపోయి, సాక్షాత్తూ ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులే ర్యాలీలు తీయడమేమటని దేశ వ్యాప్తంగా అందరూ వారి వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే కోవలో ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా ట్విట్టర్‌ వేదికగా తన గళం వినిపించింది.

ఇదేనా మనం కోరుకున్న దేశం. 8 ఏళ్ల బాలికకు కుల, మత, లింగ, వర్ణ భేదాలకు అతీతంగా మనం అండగా నిలబడలేకపోతే మనం ఇంకే విషయంపైనా పోరాడలేం. అది మానవత్వం అనిపించుకోదు కూడా.. అంటూ సానియా ట్వీట్‌ చేసింది. కాగా సానియా ట్వీట్‌కు ఓ నెటిజన్‌ స్పందిస్తూ… గౌరవనీయులైన మేడమ్‌.. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు ఒక పాకిస్థానీని పెళ్లాడారు కదా. మీకు భారత్‌తో ఇంకా సంబంధం ఉందా. పాకిస్థాన్‌ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల గురించి మీరు ట్వీట్‌ చేస్తే బాగుంటుంది.. అంటూ ట్వీట్‌ చేశాడు.

తనకు అలా ట్వీట్‌ చేసిన వ్యక్తి పట్ల సానియా కూడా స్పందించింది. ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది ముఖ్యం కాదు, నేను భారత్‌ కోసం ఆడుతాను. నేను భారతీయురాలిని. జీవితాంతం అలాగే ఉంటాను. నేను మీలాగా స్పందించకుండా ఉండలేను. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి సమయాల్లో మతాల గురించి, మరే ఇతర అంశాల గురించి మాట్లాడకపోతేనే బాగుంటుంది అనుకుంటా.. అంటూ ఆ వ్యక్తికి సానియా ఘాటు రిప్లై ఇచ్చింది. అవును నిజమే.. ఆ ఘటన ఏ మతానికో, కులానికో చెందినది కాదు. దానికి ఆ రంగులను పులమకూడదు. మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అందుకు ఏ దేశానికి చెందిన వారు అని కూడా చూడదు. అలాంటి ఘటనల పట్ల యావత్‌ ప్రపంచం, మానవత్వం ఉన్న మనుషులందరూ స్పందించాల్సిందే.

 

Comments

comments

Share this post

scroll to top