తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి తీసుకున్న రూ.1కోటికి సానియా మీర్జా టాక్స్ క‌ట్ట‌లేద‌ట‌..!

అంతే మ‌రి..! ఏ ప‌ద‌వి ఇచ్చినా, అధికారం, బాధ్య‌త‌లు అప్ప‌గించినా… ఎవ‌రైనా… ఏ స్థానంలో ఉన్న వ్య‌క్తి అయినా… అంద‌రూ చ‌ట్టం ముందు స‌మానులే. ఎవ‌రూ ఇందుకు అతీతులు కాదు. ముఖ్యంగా ఇన్‌క‌మ్‌టాక్స్‌, స‌ర్వీస్ టాక్స్ విష‌యంలో..! నాకు ఫ‌లానా బాధ్య‌త‌లు ఇచ్చార‌నో లేదంటే ఫ‌లానా ప‌ద‌వి అప్పగించార‌నో చెప్పి, ఆయా టాక్స్‌లు ఎగ్గొడ‌దామంటే కుద‌ర‌దు క‌దా..! ఎవ‌రైనా ప‌న్ను క‌ట్టాల్సిందే..! అందుకు ఎవ‌రూ మిన‌హాయింపు కాదు. ఇంత‌కీ ఈ విష‌యం అంతా ఎవ‌రి గురించి అంటారా..? అదేనండీ… మ‌న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లేదూ… ఆవిడ గురించే మేం చెబుతోందంతా..! ఇంత‌కీ ఆమె ఏం చేసింద‌నేగా మీరు అడిగేది. మ‌రికెందుకాల‌స్యం… ఆ విష‌యం ఏంటో తెలుసుకుందాం ప‌దండి..!

sania-tax

మొన్నా మ‌ధ్య అప్పుడెప్పుడో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సానియా మీర్జాను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ చేసింది క‌దా. అందుకు గాను ప్ర‌భుత్వం ఆమెకు రూ.1 కోటి రూపాయ‌ల‌ను అందించింది. అయితే ఇప్పుడదే విష‌య‌మై స‌ర్వీస్ టాక్స్ అధికారులు ఆమెకు స‌మ‌న్లు జారీ చేశారు. సానియా మీర్జా ఆ రూ.1కోటికి గాను స‌ర్వీస్ టాక్స్ చెల్లించ‌లేద‌ట‌. అందుకు గాను వారు గ‌తంలో ఓ నోటీస్ ఆమెకు పంపించారు. అందులో ఏముందంటే… ప్ర‌భుత్వం నుంచి తీసుకున్న రూ.1 కోటికి గాను స‌ర్వీస్ టాక్స్ చెల్లించాల‌ని చెప్పారు. కానీ ఆమె అందుకు స్పందించ‌లేద‌ట‌. దీంతో ఆమెకు స‌ద‌రు అధికారులు తాజాగా మ‌రో నోటీస్ ఇచ్చారు. అందులో ఏముందంటే…

ప్ర‌భుత్వం నుంచి తీసుకున్న రూ.1 కోటికి గాను స‌ర్వీస్ టాక్స్ చెల్లించ‌క‌పోవ‌డంతో ఆమె గానీ, ఆమె త‌ర‌ఫున అధికార ప్ర‌తినిధి ఎవ‌రైనా గానీ ఈ నెల 16వ తేదీన స‌ర్వీస్ టాక్స్ ఆఫీసులో హాజ‌రై స‌మాధానం చెప్పాల‌ని పేర్కొన్నారు. ఒకవేళ ఈ నోటీసుకు కూడా స్పందించ‌క‌పోతే అప్పుడు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇక ఆవిడ అధికారుల ఎదుట హాజ‌రు అవుతారో లేదో వేచి చూడాలి..! అయితే ఇదే కాదు… గ‌తంలో ఆమెకు సీఎం కేసీఆర్ రూ.1 కోటి బ‌హుమ‌తి అంద‌జేయ‌గా, యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో గెలిచి వ‌చ్చినందుకు ఆయ‌న మ‌రో రూ.1కోటిని అంద‌జేశారు. మ‌రి వాటి సంగ‌తి ఏమైందో ఏమో..! ఏమోలే… మ‌న‌కెందుకు..! ఆవిడిష్టం..! క‌డుతుందో, లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top