ఆరో రోజు “సంగీత” దీక్ష మరో స్థాయికి చేరింది..! ఏమైందంటే..? ఎన్నో అనుమానాలు..? ఎంపీ వెళ్లిన కాసేపటికే.!

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి మొదటి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు .చందానగర్ కు చెందిన సంగీతతో శ్రీనివాస్ రెడ్డికి నాలుగేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వారికి రెండేళ్ల పాప కూడా ఉంది..భర్త రెండొ పెళ్లి విషయం తెలిసిన సంగీత…భర్తను ప్రశ్నించటానికి ఇంటికి వెళ్తే…ఆమెపై దాడి చేశాడు. బందువులు చూస్తుండగానే సంగీతను ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాదు,జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు.ఇదంతా అక్కడే ఉన్నవారు సెల్ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసారు.. ఆడపిల్ల పుట్టినందుకే ఇంటి నుంచి గెంటేసినట్లు ఆరోపిస్తున్నారు బాధితురాలు సంగీత. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది.

బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆరు రోజులుగా సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వ‌చ్చిన సామాజికవేత్తల, రాజ‌కీయ నాయ‌కుల‌ ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీత కోరుతున్న ష‌రతుల‌కు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విర‌వింపజేసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంగీతకు మహిళా సంఘాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు మద్దతు పలికారు. సంగీత ఆందోళన బుధవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. అయితే ఎంపీ మల్లా రెడ్డి తనకు హామీ ఇచ్చి వెళ్లిన గంటల్లోనే అత్తామామలను అరెస్టు చేయడంపై సంగీత, మహిళా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అత్తమామ, మరిది అరెస్ట్ విషయం తెలిసి సంగీత స్పందించారు. తాను మీడియా ముఖంగా వారితో మాట్లాడాలనుకున్నానని, వారిని తన ముందుకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కానీ వారు ఇప్పుడు అరెస్టయితే, కోర్టులో ప్రవేశపెడితే మాట్లాడటానికి వీలు కాదని చెప్పారు.


ఇదిలా ఉండగా ఎంపీ మల్లారెడ్డి వెళ్లిన కాసేపటికి అరెస్టు కావడంపై మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. తొలుత మల్లా రెడ్డి స్టార్ హోటల్లో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడని, అది కుదరక సంగీత వద్దకు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసారని, కానీ తాము గట్టిగా నిలదీయడంతో, అలాగే, అత్తామామల అరెస్టు, తనకు న్యాయం కోసం సంగీత గట్టిగా అడగడంతో మల్లారెడ్డి ఏం చేయలేక వెళ్లిపోయాడని ఆరోపించారు. సంగీత అత్తామామలను తన వద్దకు తీసుకు రమ్మంటే ఈ సమయంలో ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు. అంటే ఈ సమయంలో అరెస్టు చేయిస్తే, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారని, సంగీతతో మాట్లాడనీయకుండా చేసేందుకే అలా చేశారని వాపోయారు.

Comments

comments

Share this post

scroll to top