ప‌ద‌హారేళ్ళ వ‌య‌స్సులో ప్రెగ్నెంట్ ..నా జీవితాన్ని నిల‌బెట్టిన డాక్ట‌ర్.!!

నా పేరు సంధ్య‌, 16 ఏళ్ళ వ‌య‌స్సులో..నేను ఓ అబ్బాయి చేతిలో మోస‌పోయాను.! సెక్స్ ఫీలింగ్స్ ఎక్కువ‌గా ఉంటే ఆ టీనేజ్ లో…ఏవేవో మాట‌లు చెప్పి న‌న్ను లోబ‌ర్చుకున్నాడు.! ఫ‌లితం నేను గ‌ర్భావ‌తిన‌య్యాను….ఈ విష‌యంపై ఆ అబ్బాయిని నిల‌దీస్తే…నాకేం సంబంధం లేదు..నీ దిక్కున్న చోట చెప్పుకో అని…ఫ్యామిలీతో స‌హా..మా ఊరు ఖాళీ చేసి పారిపోయాడు. ఈ విష‌యం ఇంట్లో తెల్సి..న‌న్ను ఇంట్లోంచి గెంటేశారు.! ఎటు వెళ్ళాలో తెలియ‌దు, ఏం చేయాలో తెలీదు.?

మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను..విష‌యం తెల్సి వాళ్ళ పేరెంట్స్ ఇంకోసారి మా ఇంటికి రావొద్ద‌ని ముఖం మీదే తిట్టారు. ఆ అమ్మాయితో నీకు ఫ్రెడ్షింప్ ఏంట‌ని మా ఫ్రెండ్ ను కూడా తిట్టారు.! రెండు రోజుల నుండి అన్నం తిన‌కుండా…గుళ్ళ‌ల్లో త‌ల‌దాల్చుకుంటూ గ‌డిపాను.! చావొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌నుకొని…పురుగుల మందు తాగి రోడ్డు మీద ప‌డిపోయాను.! క‌ళ్ళు తెరిచి చూసే స‌రికి హాస్పిట‌ల్ బెడ్ మీద ఉన్నాను.

నర్స్…నాకేమైంది? నన్నిక్క‌డ ఎవ‌రు జాయిన్ చేశారు? అని అడిగాను …ఈ హాస్పిట‌ల్ లో డాక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న స‌తీష్ మిమ్మ‌ల్ని ఇక్క‌డ జాయిన్ చేశారు. మీరు రోడ్డు మీద క‌ళ్ళు తిరిగిప‌డిపోతే..ఆయ‌నే స్వ‌యంగా త‌న కార్లో తీసుకొచ్చి ఇక్క‌డ జాయిన్ చేశారు. మీకు అర్జెంట్ గా అబార్ష‌న్ చేయాల్సి వ‌చ్చింది…దీంతో ఆయ‌నే అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకొని మీకు అబార్ష‌న్ చేయించారు. లేకుండా మీ ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌య్యేది.! అని చెప్పింది. ఇంత‌లో…ఎలా ఉంద‌మ్మా? అంటూ వ‌చ్చారు డాక్ట‌ర్ స‌తీష్ నా ద‌గ్గ‌ర‌కు..!!

ప‌ర్వాలేదు సార్…థ్యాంక్స్ అంటూ దండం పెట్టాను..నా డీటైల్స్ అడిగారు, నా స్టోరి సార్ కు చెప్పాను…నా ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ఆయ‌న‌..అదే హాస్పిట‌ల్ లో త‌న రిఫ‌రెన్స్ తో జాబ్ ఇప్పించారు. త‌ర్వాత మా ఇంటికొచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడారు. ఇప్పుడు నేను మా అమ్మానాన్న‌ల మాట‌లు వింటూ నా జాబ్ చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నాను.!

నేను చెప్ప‌ద‌ల్చుకుంది:
టీనేజ్ లో మ‌నస్సు మ‌న మాట విన‌దు. ఏవేవో కోరుకుంటుంది. అంద‌రూ మంచివాళ్ళే అని అనిపిస్తుంది. కానీ కాస్త జాగ్ర‌త్త‌గా మెల‌గాల్సిన ఏజ్ అది.! అడుగులు త‌డ‌బ‌డ్డాయో…జీవిత‌మే త‌ల‌కిందుల‌వుతుంది. అంద‌రికీ స‌తీష్ లాంటి వారు దొర‌క‌రు.!

Comments

comments

Share this post

scroll to top