సంధ్య ఆ తప్పు చేసినందుకే కోపంతో చంపేశానంటున్న కార్తిక్..సంధ్య గురించి కార్తిక్ అమ్మ షాకింగ్ నిజాలు!

ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించడంతో గాయపడిన సంధ్యారాణి చనిపోయింది.. ప్రేమించలేదనే ఏకైక కారణంతో కార్తిక్ అనే యువకుడు సంధ్యని చంపేశాడు… సంధ్యారాణిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి.. ఆమె మరణానికి కారణమైన కార్తీక్‌ను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు..అయితే పోలిసుల అదుపులో ఉన్న నిందితుడు కార్తిక్ మీడియాతో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. సంధ్యారాణికి లక్కీ ట్రేడర్స్‌లో తాను ఉద్యోగం ఇప్పించానని… ఆమెను ప్రేమించానని, పెండ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించడమే కాదు..మరొకరితో సన్నిహితంగా ఉండడంతో బాదతో ఈ దారుణం చేశానని చెప్పుకొచ్చాడు..మరోవైపు కార్తిక్ తల్లి తన కొడుకు గురించి,సంధ్య గురించి మరికొన్ని విషయాలు మీడియాకు తెలిపింది..

నాకొడుకు చేసింది తప్పే, వాడికి ఒకరి ప్రాణాలు తీసే హక్కు లేదు. ఏదైనా సమస్య ఉంటె పెద్దవాళ్ళతో మాట్లాడి, సమస్యని సాల్వ్ చేసుకోవాలి గాని, ఇలా చేయడం చాలా తప్పు. వాడు చేసింది తప్పని నేను ఒప్పుకున్నాను కాబట్టె, నేనే పోలీసులకి అప్పజెప్పాను అని అన్నారు. అయితే సంధ్య కుటుంబసభ్యులు  చెప్పినట్టు కార్తీక్ కు సంద్యకు అసలు పరిచయం లేదు అనేది అబద్దం. సంధ్యకు, నా కొడుక్కి కొన్నాళ్లుగా పరిచయం ఉంది.వీళ్ళిద్దరూ కలసి ఉండగా, సంధ్య వాళ్ళ బావ చూడటం వలన పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలవడం మానేశారు. కాని, కొద్దిరోజులకే ఆ అమ్మాయే ఫోన్ చేసి మాట్లాడింది… అమ్మాయికి మా అబ్బాయి ఫోన్, బట్టలు అన్నీ కొనిచ్చాడు. ఇంట్లో సరిగ్గా గడవకున్నా సంధ్యకు మాత్రం అన్నీ కొనిచ్చేవాడు. ఇంట్లో గొడవపడి 10వేల రూపాయిలు తీసుకెళ్లి ఆమెకు కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్ తీసుకుని అమ్మాయి ఇంటికెళ్తే కనీసం ఎక్కడిది ఫోన్ అని తల్లి ఎందుకు అడగలేదు?” అని ఆమె ప్రశ్నించారు. వీళ్ళిద్దరికీ  పరిచయం లేదని చెబుతున్నారు కాని, పరిచయం లేకుంటే ఆ అమ్మాయి ఫోన్లో, మా అబ్బాయి ఫోన్లో వాట్సప్ మెసేజ్ లు చూస్తే తెలుస్తుందని అన్నారు.

“సంధ్య మా ఇంటికీ వచ్చేది. కొద్దిరోజుల క్రితం నాకు ఫోన్ చేసి కార్తిక్ వేధిస్తున్నాడని చెప్పింది అయితే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా అని అడిగాను.. లేదు నేను చేసుకోను అంది. అలాంటప్పుడు మా బిడ్డను వదిలేయమని చెప్పాను. అయితే చీటికి మాటికి మావాడికి ఇక ఫోన్ చేయకని అమ్మాయికి గట్టిగా చెప్పా. కానీ అమ్మాయి మాత్రం పదేపదే ఫోన్ చేసి అక్కడికి రా.. ఇక్కడికి రా పిలిచేది. నా కొడుకు సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడు. అమ్మాయి కాళ్లకు వేసుకున్న చెప్పులు కూడా కార్తిక్ కొనిచ్చినవే. ఆమెకు ఏం కావాలన్న ఫోన్ చేసేది అబ్బాయి వెళ్లి కొనిచ్చేవాడు” నా కొడుకుని పిచ్చోడ్ని చేసింది  అని ఊర్మిళ చెప్పారు.ఒకసారి అమ్మాయి ఫోన్ పాడైందని మా అబ్బాయికి ఫోన్ చేసింది.. తీనే అన్నం పక్కనపెట్టి అమ్మాయి కోసం వెళ్లాడు. ఫోన్ రిపైర్ చేయించగా ఫోన్లో మెసేజ్‌లు చూసి మా అబ్బాయి తిట్టాడు. మా సార్ నన్ను టార్చర్ పెడుతున్నాడని అమ్మాయి చెప్పడంతో అక్కడి మాన్పేయించి మరోచోట జాబ్‌లో జాయిన్ చేయించాడు. ఈ విషయాలన్నీ సంధ్య వాళ్లింట్లో ఎవరికీ తెలియదు. మా అబ్బాయి ఇంత మూర్ఖంగా, కఠినంగా తయారవ్వడానికి అమ్మాయే కారణం. తప్పు ఇద్దరిదీ ఉందా? ఒకరిదే ఉందా? అనేది చూసి న్యాయంగా శిక్ష వేయాలి” అని ఆమె ప్రాధేయపడుతున్నారు.

ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసేది. వీడియో కాల్స్, చాటింగ్ చేసేది. మా అబ్బాయితో మాట్లాడుతూ వేరొకరితో కూడా అమ్మాయి మాట్లాడుతుండేది.. వీడు ఫోన్ చేసినా ఆమె పక్కనపెట్టి వేరే వాళ్లతో మాట్లాడేది. ఏదో సర్దుకుంటారు కదా అనుకున్నా అయితే ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదు. ఇలా చేయడం తప్పే. నువ్ నాకు వస్తువులన్నీ కొనిచ్చావని మా సార్‌కు చెప్పావ్ కదా.. నీవన్నీ ఇచ్చేస్తా ఎక్కడికి రమ్మంటావ్ చెప్పు అని శుక్రవారం ఉదయం అమ్మాయి కార్తిక్‌కు ఫోన్ చేసింది. కానీ ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఎవరిది తప్పు అని ఎవరం చెప్పలేం ఎందుకంటే కార్తిక్ చేతిలో బలయి సంధ్య ప్రాణం కోల్పోతే.. నేరం చేసి కార్తిక్ జీవితాన్నే కోల్పోయాడు..

Comments

comments

Share this post

scroll to top