సూసైడ్ ఆలోచనను జయించి..ఎంతో మందికి స్పూర్తినిచ్చింది..! ఆ బైక్ రైడర్ ఇప్పుడు ఎలా మరణించిందో తెలుసా.?

‘సూసైడ్‌ ఈజ్‌ నాట్‌ ద సొల్యూషన్‌’ అంటూ దేశానికి చాటిచెప్పిన సనా ఇక్బాల్‌ జీవితం విషాదాంతమైంది. మరణం అంచుల్లో ఉన్న ఎంతోమందికి జీవితపు లోగిళ్లలో వెలుగులు నింపింది. తాను స్వయంగా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యా సదృశమైన పరిస్థితులను జయించి ఫీనిక్స్‌లా పైకెగిసింది. తనలాగే డిప్రెషన్‌తో బాధడేవాళ్లను కలిసి ఆ బాధల నుంచి విముక్తి కల్పించింది. సనా స్ఫూర్తితో ఎంతోమంది ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకున్నారు. కానీ ..మూడు పదుల వయసులోనే  దుర్ఘటనలో కన్నుమూసింది.

 ప్రముఖ బుల్లెట్‌ రైడర్, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మోటివేటర్‌ సనాఇక్బాల్‌(32) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించారు. తనతో వేరుగా ఉంటున్న భర్త అబ్దుల్‌ నదీమ్‌తో కలసి సనా ప్రయాణిస్తున్న కారు నార్సింగిలోని సన్‌సిటీ వద్ద డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఉదంతంలో సనా తీవ్రగాయాలతో మరణించగా.. నదీమ్‌ గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే తన కుమార్తెను ఆమె మాజీ భర్తే హత్య చేశాడని సనా తల్లి షాహీన్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపనలకు కారణాలు తెలుసుకునే ముందు సనా గురించి తెలుసుకుందాం..

‘ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు’ అనే సందేశంతో చేపట్టిన ఆ సాహసయాత్ర వెనుక ఎంతో విషాదంఉంది. సనా తల్లి షాహీన్‌ అడ్వొకేట్‌. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. సనా 2014 డిసెంబర్‌లో అబ్దుల్‌ నదీం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. నదీం వేధింపులతో సనాకు జీవితంపైనే విరక్తి కలిగింది. అతని నుంచి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆమె గర్భిణి. ‘ఇక ఈ జీవితం బతకడానికి పనికిరానిదంటూ’ ఆమె తరచుగా బాద పడుతూ,ఒకానోక దశలో ఆత్మహత్యచేసుకోవాలనుకుని కూడా వెనక్కి వచ్చింది.. తాను స్వయంగా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యా సదృశమైన పరిస్థితులను జయించి ఫీనిక్స్‌లా పైకెగిసింది. తనలాగే డిప్రెషన్‌తో బాధడేవాళ్లను కలిసి ఆ బాధల నుంచి విముక్తి కల్పించింది. సనా స్ఫూర్తితో ఎంతోమంది ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకున్నారు. కానీ సనా…మూడు పదుల వయసులోనే మంగళవారం నాటి దుర్ఘటనలో కన్నుమూశారు.

Comments

comments

Share this post

scroll to top