సామ్సంగ్ S10 ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు, మడత ఫోన్ తో యాపిల్ ని తొక్కి పడేసింది సామ్సంగ్..!!

సామ్సంగ్ ప్రతి సంవత్సరం గ్యాలక్సీ S సిరీస్ ను లాంచ్ చేస్తూ వస్తుంది, యాపిల్ ఫోన్స్ కు ఈ S సిరీస్ లు పోటీ అనమాట, యాపిల్ యాపిల్ ఏ అని అనుకునేవాళ్ళని కూడా సామ్సంగ్ తన S సిరీస్ ల ఫోన్ తో ఆకర్షించింది, గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో యాపిల్ ఆపరేటింగ్ సిస్టం కు ధీటుగా బదులిస్తూ వచ్చింది. ఆండ్రాయిడ్ 9 పై మీద సామ్సంగ్ S10 డివైస్ లు రన్ అవుతాయి, సామ్సంగ్ S9 తో పోలిస్తే S10 లో డిజైన్ లోను, ఫీచర్స్ లోను చాలా మార్పులు తీసుకువచ్చింది సామ్సంగ్.

స్క్రీన్ లో కెమెరాలు.. :

మొబైల్ స్క్రీన్ లో ఒక కెమెరా ని చూసాము హానర్ వ్యూ 10 మొబైల్ లో, కానీ సామ్సంగ్ S10+ లో రెండు కెమెరాలు ఉన్నాయ్ స్క్రీన్ లో, వెనకాల మూడు కెమెరాలు, మొత్తం 5 కెమెరాలతో సామ్సంగ్ S10+ వస్తుంది, ఇక సామ్సంగ్ S10 స్క్రీన్ లో ఒక కెమెరా మాత్రమే ఉంది, వెనకాల సామ్సంగ్ S10+ లాగానే మూడు కెమెరాలు కలిగుంది. 5G సపోర్ట్ చేసే సామ్సంగ్ S10 ని కూడా ఆవిష్కరించారు, కానీ ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా చెప్పలేదు, ఇండియా లో రేపటి నుండే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు సామ్సంగ్ S10 మరియు సామ్సంగ్ S10+ మొబైల్స్ ను.

మడత స్క్రీను…ఇదేందయ్యా ఇది…:

మడత ఫోన్ల గురించి మనం చూస్తూనే ఉన్నాం, ప్రొటోటైప్ మడత ఫోన్స్ చాలానే వచ్చాయి, కానీ అందరికి అందుబాటులో ఉండే లాగా సామ్సంగ్ మడత ఫోన్ ని తీసుకొచ్చింది, దీని ధర లక్షన్నర పైనే ఉండొచ్చు ఇండియా లో, ఈ మడత ఫోన్ ని చుసిన అందరు ఆశ్చర్యపోతున్నారు, ధర చూసి కూడా ఆశ్చర్యపోయారు, కానీ ఒక కొత్త అనుభూతి పొందడానికి ఆ మాత్రం పెట్టడం లో తప్పు లేదని చాలా మంది వాదన, పెట్టిన ధర కి 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుండటం తో అంత ధర పెట్టడం లో అస్సలు తప్పు లేదు, ఏప్రిల్ నుండి ఈ మడత ఫోన్ ని అందుబాటులోకి తేనుంది సామ్సంగ్. ఈ ఫోన్ తో యాపిల్ యూజర్స్ నే కాదు, యాపిల్ కంపెనీ ని సైతం ఆశ్చర్యపరిచింది సామ్సంగ్.

తక్కువ ధరలో.. :

తక్కువ ధరలో హై ఎండ్ ఫీచర్స్ ని అందించడానికి సామ్సంగ్ S10E స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది, ఈ మొబైల్ ధర ఇండియా లో RS.50,000/- వరకు ఉంటుందని సమాచారం, ఈ ఇయర్ సామ్సంగ్ రిలీజ్ చేసిన ఈ నాలుగు ఫోన్స్ యాపిల్ ని తొక్కిపడేసేలాగే ఉన్నాయ్, మరికొద్ది రోజుల్లోనే యాపిల్ ని తొక్కేయ్యనుందా లేదా అనే విషయం తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top