“సామ్రాట్” కేసులో కొత్త ట్విస్ట్..! బయటపడ్డ మరో కోణం…! అతనో ‘బైసెక్సువల్’?.. భార్య పక్కనుండగానే!..

సినీ నటుడు సామ్రాట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే… కొంత కాలంగా సామ్రాట్ రెడ్డి – అతని భార్య హర్షిత రెడ్డి మధ్య గొడవలుండడంతో ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు..భర్తపై 498/A కేసు నమోదు చేసింది హర్షిత రెడ్డి.. ఇప్పుడు తన ఇంట్లోనే దొంగతనం చేశాడని కంప్లైంట్ చేయడంతో పోలీసులు సామ్రాట్ ను అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల వీరి వైవాహిక జీవితంలో.. ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నారు…ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ తో ఈ విషయం బయటికి వచ్చింది..అయితే సామ్రాట్ గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి…

పోలిసుల రిమాండ్లో ఉన్న సామ్రాట్ గురించి భార్య హర్షిత అనేక విషయాలు బైట పెట్టారు.సామ్రాట్ కి డ్రగ్స్,హుక్కా అలవాట్లుండేవి.అంతేకాదు సామ్రాట్ గే అని ఆమె ఆరోపించారు…సామ్రాట్ కి ఎంతో మంది మగ స్నేహితులు ఉన్నారని, ఆయన ఓ గే అన్న విషయం కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని షాక్ తిన్నానని హర్షిత ఆరోపించింది.బయటికి వెళ్లినప్పుడు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి, లేడీ డ్రైవర్ మాదిరిగా చూస్తుండేవాడని ఆరోపించింది.బయటకు వెళ్లినప్పుడు తనపట్ల ప్రేమను కురిపించినట్టు డ్రామాలు అడి, ఇంటికొచ్చిన తర్వాత తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపింది.. అలాగే తన తండ్రి షేర్లను బదిలీచేయమని కోరితే దీనికి అంగీకరించకపోవడంతో గత ఏడాది నుంచి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని ఆమె తెలియజేశారు..

రెండేళ్ల క్రితం సామ్రాట్‌తో మా కూతురు పెళ్లి చేశాము, సినిమా వారికి మా బిడ్డను ఇవ్వడం ముందు నుండీ మాకు ఇష్టం లేదు. అయినా అతడు పలుసార్లు మా వెంటపడి ఒప్పించాడు, బిజినెస్ చేస్తాను, సినిమాలు మానేస్తాను అని మాయ మాటలు చెప్పాడని.. సామ్రాట్ తల్లిదండ్రులు, అక్కలు గానీ ఏ మాత్రం అతడిని అదుపులో పెట్టలేదు. అతడు ఏం చేసినా సపోర్టు చేసేవారు. వారి అండతో అతను మరింత రెచ్చిపోయి చెడు అలవాట్లకు బానిసయ్యాడు అని….. హర్షిత తల్లిదండ్రులు తెలిపారు. డ్రగ్స్, సెక్స్.. ఈ రెండు సామ్రాట్‌కు వ్యసనంగా తయారైనట్లు అతని మామ ఆరోపిస్తున్నారు. కాల్ గర్ల్స్‌తో సంబంధాలు మాత్రమే కాకుండా.. విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలతోనూ సామ్రాట్ సంబంధం పెట్టుకున్నాడని అతని మామ ఆరోపించారు. అంతేకాదు, సామ్రాట్‌కు ఒక ‘గే’ ఫ్రెండ్ ఉన్నాడని, సామ్రాట్ ఒక ‘బైసెక్సువల్’ అని ఆరోపించారు.

వీరి ఆరోపణల్లో నిజానిజాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరొవైపు వీరి ఆరోపణలపై సామ్రాట్ ,సామ్రాట్ తల్లి స్పందించారు..తనకు డ్రగ్స్ అలవాటు ఉందని తన భార్య హర్షిత, ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని .. తనకు ఆ అలవాటే ఉంటే… పోలీసులకు ఎప్పుడో పట్టుబడేవాడినని.. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నాడు. ఇద్దరి మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకనే ఈ గొడవ మొదలయ్యాయని… హర్షిత రెడ్డి తల్లిదండ్రులు కూడా కూతురికి సహకరిస్తూ అల్లుడిని తీవ్ర పదజాలంతో మాట్లాడేవారని, దీంతో సామ్రాట్ తనకు విడాకులు కావాలని చెప్పాడని సామ్రాట్ తల్లి తెలిపారు.పదేళ్ల నుంచి అతడు సినీ పరిశ్రమలో ఉన్నాడని, ఇంతవరకు తన కొడుకుపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. సామ్రాట్‌కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆమె స్పష్టంచేశారు. తన కొడుకు సామ్రాట్ ఉంటున్న ఇంట్లో తనకు చెందిన వస్తువులు తీసుకుంటే తప్పేంటని సామ్రాట్ తల్లి  జయరెడ్డి ప్రశ్నించారు. ఆ ఇంట్లో సామ్రాట్‌కు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టడంతో ఆగ్రహానికి లైనై వాటిని ధ్వంసం చేసినట్టు ఆమె తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top