సంప్రదాయం తెలియక భార్య చేసిన పనికి నవ్వుకున్న “పవన్”.! ఇంతకీ ఆమె ఏం చేసింది..?

కరీంనగర్ జిల్లా, కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించి,అక్కడే రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని పేర్కోన్న  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..అందులో భాగంగానే కొండగట్టుకి బయల్దేరారు..తెలంగాణా రాష్ట్రంలో నాలుగు రోజులపాటు మూడు జిల్లాల్లో పర్యటన చేయనున్నారు పవన్.. పవన్ ముందుగా తన ఇంటి నుండి జనసేన కార్యాలయానికి చేరుకుని అక్కడనుండి కొండగట్టుకి బయల్దేరారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది..ఆ విషయం ఏంటి..పవన్ పర్యటన వివరాలు ఏంటి మీకోసం..

కుంకుమ తిలకం దిద్ది,దిష్టి తీసిన అన్నా లెజోనెవా

హిందువుల సంస్కృతి,సంప్రదాయలను గురించి పెద్దగా తెలియని పవన్ భార్య అన్నా లెజోనివా ఆమె చూపుడు వేలితో కుంకుమను తీసుకుంది.. దీంతో వెంటనే పవన్ నవ్వుకొని, ఆ వేలితో కాదని, కుడిచేయి ఉంగరం వేలితో బొట్టు పెట్టాలని సూచించారు. భర్త చెప్పినట్లుగానే ఆమె ఉంగరం వేలితో కుంకుమతీసుకుని పవన్ కి తిలకం దిద్దింది.. ఆ తర్వాత కారు ఎదుట కొబ్బరికాయ కొట్టారు లెజినోవా. ఆ కొబ్బరికాయ పగలకపోవడంతో పవన్ మరోసారి నవ్వుకున్నారు. మళ్లీ కొట్టాలని సూచించడంతో ఆమె మరోసారి కొబ్బరికాయ కొట్టింది. దీంతో అది పగిలింది…ఆ తర్వాత సతీమణి ఎదురు రావడంతో కొండగట్టుకి బయలుదేరారు..

పర్యటన వివరాలు

  • మంగళవారం(జనవరి-23) ఉదయం 10.45 కు కరీంనగర్ లోని జగిత్యాల రోడ్ లో శుభం గార్డెన్స్ లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్  జిల్లాల జనసేన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
  • మధ్యాహ్నం లంచ్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం బయల్దేరి వెళతారు. రాత్రి కొత్తగూడెంలోనే ఉండనున్నారు.
  • 24 వ తేదీ ఉదయం 9.30 కు కొత్తగూడెం నుంచి ర్యాలీగా మధ్యాహ్నం 1.30 వరకు ఖమ్మం చేరుకుంటారు.

  • 24వ తేదీన మద్యాహ్నం 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు పవన్.
  • మీటింగ్ తర్వాత ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్  బయల్దేరేలా  షెడ్యూల్ ప్లాన్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top