ఎలిమినేషన్ ముందు కిచెన్ లో కత్తులతో..”బిగ్ బాస్” లో “సంపూ” సూసైడ్ చేసుకోబోయాడంట? టీవీలో డిలీట్!

సెకెండ్ ఎలిమినేష‌న్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకొని వెళ్ళిపోయారు.! నాలుగు గోడ‌ల మ‌ద్య ఉండ‌లేనంటూ…ముందు నుండి బిగ్ బాస్ కు చెబుతున్న సంపూ…నిన్న చాలా ఎమోష‌న‌ల్ గా ప్ర‌వ‌ర్తించాడు. చ‌చ్చిపోతున్నా ప‌ట్టించుకోరా అంటూ మండిప‌డ్డాడు. అత‌డిని క‌న్ఫెష‌న్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అత‌ని ప్రాబ్ల‌మ్ ఏంటో చెప్ప‌మ‌న్నాడు. దానికి సంపూ….నేనెప్పుడు ఇలా ఉండ‌లేదు…అద్దాల గోడ‌ల మ‌ద్య ఉండ‌డం వ‌ల్ల టెన్ష‌న్ పెరిగిపోతుంది. నా ఊరి వాళ్ళ‌ను చూడ‌కుండా ఉండలేను..ఇప్పుడే వెళ్ళిపోతా అని అన్నాడు.దానికి బిగ్ బాస్..మీరు మీ ఇష్ట‌పూర్వ‌కంగానే షోకి వ‌చ్చారు..మిమ్మ‌ల్ని ఎవ‌రూ బ‌ల‌వంత‌పెట్ట‌లేదు…హౌస్ లోని స‌భ్యులంద‌రికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా…సంపూ వెళ్ళిపోవ‌డానికే ఇంట్ర‌స్ట్ చూప‌డంతో….అత‌డిని డోర్స్ తెరుచుకొని వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్.

ఇందుకు గానూ… కాంట్రాక్ట్ ప్ర‌కారం షో మ‌ద్య‌లో వెళ్ళిపోతే…త‌ద‌నంత‌రపు ఆర్థిక, చ‌ట్ట‌ప‌ర‌మైన విష‌యాల‌ను సంపూ ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పాడు బిగ్ బాస్.! అయితే ఈ షోకు గానూ… సంపూకు వారానికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం..ఇలా కాంట్రాక్ట్ ను ఉల్లంఘించి మ‌ధ్య‌లోనే సంపూ షో నుండి వెళ్ళిపోయాడు కాబ‌ట్టి అత‌నికి రావాల్సిన రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క‌పోవొచ్చు.! ఇక చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ…..అంత‌గా ఏం ఉండ‌క‌పోవొచ్చనేది భావ‌న‌..కేవ‌లం మిగితా పార్టిసిపెంట్స్ లో భ‌యం క‌ల్గించ‌డానికి ఆ మాట‌లు అన్న‌ట్టు అర్థం చేసుకోవొచ్చు.

ఈ షోలో గెలిచి..ఓ ఇళ్ళు కొనుక్కోవాల‌నుకున్న సంపూ….హౌస్ లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఈ వాతావ‌ర‌ణానికి సెట్ అవ్వ‌లేకపోయాడు. రాగానే అత‌డు ఈ షోకి అన‌ర్హుడ‌ని చాలా మంది ఓట్లు వేసిన‌ప్ప‌టికీ..బిగ్ బాస్ అత‌నినే కెప్టెన్ గా నియ‌మించాడు. అయినా సంపూ మిగితా ఇంటి స‌భ్యుల‌తో అంత‌గా మింగిల్ అవ్వ‌లేక‌పోయాడు. సో…ఇళ్ళు క‌ట్టుకోవాల‌ను అత‌ని క‌ల తీర‌కుండానే…సంపూ షో నుండి నిష్క్ర‌మించాడు.

సంపూ వీరంగం వీడియోలో..

అయితే ఈ ఎపిసోడ్ వెనక ఓ దారుణం చోటు చేసుకోబోయి ఆగిందని టీవీ మీడియా అంతర్గత వర్గాల కథనం. బిగ్‌బాస్ షో పార్టిసిపేట్‌ సంపూర్ణేష్ బాబు ఆత్మహత్యా ప్రయత్నం చేసాడనే వార్త‌ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అదృష్టం బాగుండి అది సీరియస్ అవ్వలేదు కాబట్టి బయిటపడ్డాడంటున్నారు. అసలు ఏమైందటే.. సంపూర్ణేష్ బాబు మానిక్ బిహేవియర్ తో బిగ్ బాస్ హౌస్ లో సూసైడ్ ఎటెమ్ట్ చేసాడని చెప్తున్నారు. అతను కిచెన్ లో కత్తులతో మొదట తనను తాను చంపుకుంటానని బెదిరించాడని, అయితే బిగ్ బాస్ అతన్ని బయిటకు పంపే ఉద్దేశ్యం లేదని అనటంతో తనను ఎలాగైనా బయిటకు పంపాలంటే తనను తాను గాయిపరుచుకోవటం ఒకటే మార్గమని సంపూ ప్రయత్నంచాడు. అది ఓ టైమ్ లో సీరియస్ అయ్యే పరిస్దితి వచ్చిందని… అదృష్టం బాగుండి బయిటపడ్డాడు కానీ అది సూసైడ్ గా మారేదని చెప్పుకుంటున్నారు. అయితే ఈ షో చూస్తున్న ఆడియన్స్ ఈ వైలెంట్ బిహేవియర్ ని చూసి తట్టుకోలేరని దాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేసారని తెలుస్తోంది.

ప్రతి మూలా కెమెరాలు ఉన్న ఇంట్లో 14 మందిని ‘బంధించి’ వారికి బయటి వాతావరణం చూపకుండా, టైమ్‌ చెప్పకుండా, పేపర్‌ ఇవ్వకుండా, టీవీ ఫోన్‌ లేకుండా కేవలం నాలుగు గోడల మధ్య ఉంచి వారి మధ్య భావోద్వేగాలను కాప్చర్‌ చేయడం ఈ షో ఉద్దేశం. టీవీ నటుడు సమీర్, ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్, కమెడియన్‌ ధన్‌రాజ్‌ తదితరులు పాల్గొంటున్న ఈ షోలో సభ్యులను ‘క్లాస్ట్రోఫోబియా’ బాధిస్తున్నదని తెలియవస్తోంది. కిటికీలు లేని గదుల్లో, లిఫ్ట్‌లలో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా’ అంటారు. ప్రస్తుతం నటుడు సంపూర్ణేశ్‌ బాబు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఈ భావనతో బాధపడుతున్నాడు. ‘నాది పల్లెటూరి నేపథ్యం. ఇక్కడ నన్ను బంధించేసినట్టుగా ఉంది. నన్ను పంపించేయండి’ అని అతడు బిగ్‌బాస్‌ షోలో ప్రాధేయ పడ్డాడు.

Comments

comments

Share this post

scroll to top