బిగ్ బాస్ షో నుండి….డోర్లు తెరుచుకొని వెళ్లిపోయిన సంపూ.!

సెకెండ్ ఎలిమినేష‌న్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకొని వెళ్ళిపోయారు.! నాలుగు గోడ‌ల మ‌ద్య ఉండ‌లేనంటూ…ముందు నుండి బిగ్ బాస్ కు చెబుతున్న సంపూ…నిన్న చాలా ఎమోష‌న‌ల్ గా ప్ర‌వ‌ర్తించాడు. చ‌చ్చిపోతున్నా ప‌ట్టించుకోరా అంటూ మండిప‌డ్డాడు. అత‌డిని క‌న్ఫెష‌న్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అత‌ని ప్రాబ్ల‌మ్ ఏంటో చెప్ప‌మ‌న్నాడు. దానికి సంపూ….నేనెప్పుడు ఇలా ఉండ‌లేదు…అద్దాల గోడ‌ల మ‌ద్య ఉండ‌డం వ‌ల్ల టెన్ష‌న్ పెరిగిపోతుంది. నా ఊరి వాళ్ళ‌ను చూడ‌కుండా ఉండలేను..ఇప్పుడే వెళ్ళిపోతా అని అన్నాడు.దానికి బిగ్ బాస్..మీరు మీ ఇష్ట‌పూర్వ‌కంగానే షోకి వ‌చ్చారు..మిమ్మ‌ల్ని ఎవ‌రూ బ‌ల‌వంత‌పెట్ట‌లేదు…హౌస్ లోని స‌భ్యులంద‌రికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా…సంపూ వెళ్ళిపోవ‌డానికే ఇంట్ర‌స్ట్ చూప‌డంతో….అత‌డిని డోర్స్ తెరుచుకొని వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్.

ఇందుకు గానూ… కాంట్రాక్ట్ ప్ర‌కారం షో మ‌ద్య‌లో వెళ్ళిపోతే…త‌ద‌నంత‌రపు ఆర్థిక, చ‌ట్ట‌ప‌ర‌మైన విష‌యాల‌ను సంపూ ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పాడు బిగ్ బాస్.! అయితే ఈ షోకు గానూ… సంపూకు వారానికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం..ఇలా కాంట్రాక్ట్ ను ఉల్లంఘించి మ‌ధ్య‌లోనే సంపూ షో నుండి వెళ్ళిపోయాడు కాబ‌ట్టి అత‌నికి రావాల్సిన రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క‌పోవొచ్చు.! ఇక చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఫేస్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పిన‌ప్ప‌టికీ…..అంత‌గా ఏం ఉండ‌క‌పోవొచ్చనేది భావ‌న‌..కేవ‌లం మిగితా పార్టిసిపెంట్స్ లో భ‌యం క‌ల్గించ‌డానికి ఆ మాట‌లు అన్న‌ట్టు అర్థం చేసుకోవొచ్చు.

ఈ షోలో గెలిచి..ఓ ఇళ్ళు కొనుక్కోవాల‌నుకున్న సంపూ….హౌస్ లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఈ వాతావ‌ర‌ణానికి సెట్ అవ్వ‌లేకపోయాడు. రాగానే అత‌డు ఈ షోకి అన‌ర్హుడ‌ని చాలా మంది ఓట్లు వేసిన‌ప్ప‌టికీ..బిగ్ బాస్ అత‌నినే కెప్టెన్ గా నియ‌మించాడు. అయినా సంపూ మిగితా ఇంటి స‌భ్యుల‌తో అంత‌గా మింగిల్ అవ్వ‌లేక‌పోయాడు. సో…ఇళ్ళు క‌ట్టుకోవాల‌ను అత‌ని క‌ల తీర‌కుండానే…సంపూ షో నుండి నిష్క్ర‌మించాడు.

సంపూ వీరంగం వీడియోలో..

Comments

comments

Share this post

scroll to top