సంపూ ది రియల్ హీరో…. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ప్రోత్సాహం. ర్యాంక్ కొట్టు చెక్ పట్టు అంటూ ఆఫర్.!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. చైన్నై వరదల సమయంలో హీరోలందరి కంటే ముందే స్పందించిన సంపూ ఇప్పుడు మరో మారు ఓ స్కూల్  లోని పదవ తరగతి విద్యార్థులను  తన మాటలతో ప్రేరేపించాడు.  తాజాగా సంపూ తదుపరి చిత్రం ‘కొబ్బరిమట్ట’ సినిమా షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని అరటికట్ల గ్రామంలో జరుగుతుంది.

Sampoornesh-Babu-New-Movie-Www-Virus-Com
షూటింగ్ విరామంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సంపూ. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. టాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు రూ.15,000 లు చొప్పున బహుమతిగా ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. దాంతో విద్యార్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. చదువు విషయంలో అశ్రద్ధ చూపించరాదని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు, దేశానికి సేవ చేయాలని విద్యార్థులను కోరాడు.

Comments

comments

Share this post

scroll to top