బ‌ర్గ‌ర్ కంటే….స‌మోసానే బెస్ట్.! తేల్చిచెప్పిన సైంటిస్టులు.!!

ఆలుగడ్డ‌, బ‌టానీ, మిర‌ప‌కాయ‌లు వేసి వండిన‌ కూర‌తో త‌యారు చేసిన స‌మోసా ఒక వైపు.. బ్రెడ్‌, వెజిట‌బుల్స్‌, చీజ్‌, ప్యాటీ వంటి ప‌దార్థాల‌తో త‌యారు చేసిన బ‌ర్గ‌ర్ మ‌రోవైపు.. ఏంటీ చెబుతుంటేనే నోరూరిపోతుందా..! క‌రెక్టే… ఇంత‌టి హాట్ డెలిషియస్ జంక్ ఫుడ్ గురించి చెబితే ఎవ‌రికైనా నోట్లో నీళ్లూరుతాయి లెండి. అది వేరే విష‌యం. అయితే ఇంత‌కీ అస‌లు.. విష‌యం ఏమిటంటే… స‌మోసా, బ‌ర్గ‌ర్‌.. ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం..? అంటే.. అఫ్‌కోర్స్ చాలా మంది బ‌ర్గ‌ర్‌కే ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పుడంతా పాష్ జ‌మానా అయిపోయింది క‌దా. మన భార‌తీయ ఆహారాల‌ను త‌క్కువ చేసి చూస్తున్నారు. అయితే అలా చూసేవారికి నిజంగా ఇప్పుడు మేం చెప్పేది చేదు వార్తే. ఎందుకంటే బ‌ర్గ‌ర్ మ‌న ఆరోగ్యానికి చాలా హానిక‌ర‌మ‌ట‌. దానిక‌న్నా స‌మోసాయే బెట‌ర్ అని చెబుతున్నారు.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు. సాక్షాత్తూ సైంటిస్టులే ప్ర‌యోగాలు చేసి మ‌రీ వెల్ల‌డించిన వాస్త‌వం ఇది. బ‌ర్గ‌ర్ క‌న్నా స‌మోసాయే మంచిద‌ని వారు చెబుతున్నారు. Centre for Science and Environment (CSE) అనే సంస్థ‌కు చెందిన సైంటిస్టులు తాజాగా స‌మోసా, బ‌ర్గ‌ర్‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వారు కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. అవేమిటంటే… బ‌ర్గ‌ర్‌లో త‌యారీలో వాడే ప్రిజ‌ర్వేటివ్స్‌, యాసిడిటీ రెగ్యులేట‌ర్స్‌, ఎమ‌ల్సిఫైర్స్‌, ఇంప్రూవ‌ర్స్‌, రిఫైన్డ్ పిండి, చ‌క్కెర‌, వీట్ గ్లూటెన్‌, ఆయిల్స్, ఈస్ట్‌, సోయా ఫ్లోర్ వంటివ‌న్నీ స‌హ‌జ సిద్ధ‌మైన‌వి కావ‌ట‌. అవ‌న్నీ కృత్రిమంగా త‌యారు చేసేవ‌ట‌. ఇక స‌మోసా త‌యారీలో వాడే గోధుమ పిండి, జీల‌కర్ర‌, ఉడికించిన ఆలుగ‌డ్డ‌లు, బ‌టానీలు, మిర‌ప‌కాయ‌లు, మ‌సాలాలు వంటివ‌న్నీ స‌హ‌జ సిద్ధ‌మైన‌వి. క‌నుక స‌హ‌జ‌సిద్ధ‌మైన వ‌స్తువుల‌తో త‌యారు చేసే స‌మోసాయే మన ఆరోగ్యానికి మంచిద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోగ్యానికి బ‌ర్గ‌ర్ మంచిది కాద‌ని వారు అంటున్నారు.

అయితే స‌హ‌జ సిద్ధ‌మైన వ‌స్తువుల‌తో స‌మోసాను త‌యారు చేసిన‌ప్ప‌టికీ అది జంక్ ఫుడ్ కింద‌కే వ‌స్తుంది. ఎందుకంటే ఆయిల్‌లో వేసి స‌మోసాల‌ను వేయిస్తారు క‌దా. అందుక‌ని అది జంక్ ఫుడ్డే అవుతుంది. అంత మాత్రం చేత స‌మోసాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయ‌ని కాదు, అవి కూడా హాని క‌లిగిస్తాయి. వాటిల్లో ఉండే ఆయిల్ కంటెంట్ మ‌న శ‌రీరానికి మంచిది కాదు. కాక‌పోతే బ‌ర్గ‌ర్‌తో పోలిస్తే మాత్రం స‌మోసా తిన‌డ‌మే బెట‌ర‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక‌.. ఇప్ప‌టి నుంచి మీరే డిసైడ్ చేసుకోండి, స‌మోసా తినాలా.. లేదంటే బ‌ర్గ‌రా అని..!

Comments

comments

Share this post

scroll to top