బాహుబలి2 సినిమాకు వెళ్లిన “సమంత”.. 20 నిమిషాల్లోనే బయటికి ఎందుకు వచ్చిందో తెలుసా..?

బాహుబలి2 సినిమాను సినీ ప్రముఖులు ఆకాశానికెత్తేస్తున్నారు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. దీంతో దర్శకనిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు విడుదల రోజు 40 మంది చిన్నారులతో కలిసి నూన్ షోకు వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. హైద్రాబాద్‌లోని ఓ థియేటర్‌కు చిన్నారులతో కలిసి బాహుబలి2 సినిమాకు సమంత వెళ్లింది. ఆ తర్వాత ఆమె సినిమాను అభినందిస్తూ ట్వీట్ కూడా చేసింది. కానీ ఆమె సినిమా ఆసాంతం చూడనేలేదట.

సమంత వెళ్లిన థియేటర్‌లో ఏసీ పనిచేయలేదట. సినిమా ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఏసీ ట్రబుల్ ఇచ్చిందట. ఎంతైనా హీరోయిన్ కదా… ఉక్కపోత తట్టుకోలేక 20 నిమిషాల్లోనే బయటికొచ్చేసినట్లు తెలిసింది. చిన్నారులు మాత్రం ఆ ఉక్కపోతలోనే సినిమాను వీక్షించారని సమాచారం. సినిమా ప్రమోషన్‌లో ఉన్న బాహుబలి2 టీంకు, ఈ విషయం బయటికి పొక్కేసరికి కొంత ఇబ్బందిగా ఉందట. థియేటర్ యాజమాన్యం కలిగిన అసౌకర్యానికి సమంతకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top