సమంతా సోల్ మేట్ అంటూ పెట్టిన ఫోటో లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..ఆ వ్యక్తికి సమంతా కి ఉన్న రిలేషన్ తెలుసా.

సమంత,నాగచైతన్యల పెళ్లి హడావిడి ముగిసింది..అభిమానులు,సినిమావాళ్లు మిస్ అయ్యారు అనే ఆలోచన లేకుండా గంట గంటకూ అప్డేట్స్ ట్విటర్ లో పంచుకున్నారు సమంతా ,నాగార్జున.. పెళ్లి  తర్వాత కుటుంబంతో కాస్త బిజిబిజీగా గడుపుతోంది సమంతా. అయినప్పటికీ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా దగ్గరగానే ఉంటోంది.అంతేకాదు ఇటీవలే రిలీజైన తన సినిమా రాజుగారి గది 2 ప్రమోషన్స్ లో కూడా మామ నాగ్ తో పాటు పాల్గొంది..మరోవైపు ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా.. ఆమె తన సోల్ మేట్‌గా అంటూ ఒక వ్యక్తి తో దిగిన ఫోటో పెట్టింది..ఇంకెవరూ నాగచైతన్యే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే..

సమంతా పెట్టిన సోల్ మేట్  పిక్ గంటలో దాదాపు లక్ష లైక్స్ సొంతం చేసుకుంది. సమంతను అభిమానులు ఎంతగా ఫాలో అవుతారో ఇది చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ సమంత పెట్టిన ఫోటోలో ఆమెతో ఉన్నది ఎవరిదో తెలుసా? దగ్గుబాటి రామానాయుడు మనవరాలు మాళవిక. ఆమెతో దిగిన ఫోటో పెట్టి మాళవికను సమంత తన సోల్ మేట్‌గా పేర్కొంది.ఈమె దగ్గుబాటి రాణా సోదరి కూడా..

ఇక్కడొక ఇంట్రస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామా..నాగచైతన్య ,రాణా ఇద్దరు బావా బావమరుదులు అవుతారు..నాగచైతన్య కి రామానాయుడి గారి మనుమరాల్లలో ఒకరిని ఇచ్చి చేయాలనేది రామానాయుడిగారి భార్య కోరికట..అలా నాగచైతన్య పెళ్లి చేసేప్పుడు తన మనుమరాలి మెడలో తన నెక్లెస్ వేయాలనేది కూడా ఆమె కోరికే..అయితే నాగచైతన్య రామానాయుడి మనుమరాలిని అంటే మేనమామలైన వెంకటేష్,సురేశ్ బాబు ల కూతుర్లను కాదని సమంతా ని పెళ్లి చేసుకున్నప్పటికీ ,రామానాయుడి గారి సతీమణి నెక్లెస్ ని సమంతా మెడలో వేశారు..లక్షలక్షలు విలువ చేసే ఆభరణాలు ధరించే స్థోమత ఉన్నప్పటికీ రెండు లక్షలు విలువ చేసే నగ ధరించడానికి కారణం అదట..నాగార్జున,లక్ష్మీ విడాకుల తర్వాత ఎడమొఖం,పెడమొఖం గా ఉన్న రెండు కుటుంబాలు సమంతా నాగచైతన్య పెళ్లితో ఒకటవ్వడం మాత్రమే కాదు..ఆ పెళ్లి వేడుకను ఆ రెండు కుటుంబాలే ఎంజాయ్ చేసాయి… ఆ ఇంటి అల్లుడు కావాలసిన చైతన్యని సమంత ఎగరేసుకుపోయిందనే ఆలోచన ఏ మాత్రం లేకుండా దగ్గుబాటి ఫ్యామిలి కూడా సమంతను ఆదరించడం విశేషం.అలా కాకుండా చై పెళ్లి విషయంలో కూడా తమ ఇంటి పిల్లను చేసుకోలేదనే మనస్పర్దలు వచ్చుంటే ఈ కుటుంబాలు కలిసే పరిస్థితి ఉండేదో లేదో..ఇప్పడు సమంతా సోల్ మేట్ అని పెట్టిన ఫోటో రెండు కుటుంబాల అన్యోన్యతనే కాదు..సమంతాని ఆ రెండు కుటుంబాలు ఎలా ట్రీట్ చేస్తున్నాయి..సమంతా వారిని ఎలా భావిస్తుంది అనేది కూడా స్పష్టమవుతుంది…తండ్రి పెళ్లితో విడిపోయిన కుటుంబాలు కొడుకుపెళ్లితో కలిసిపోయి శుభం కార్డు పడిందన్నమాట…

Comments

comments

Share this post

scroll to top