“ఇవాంక”కు “సమంత” ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటో తెలుసా..? దాని ప్రత్యేకతలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఇంటికొచ్చిన చుట్టాలకు ఏదొ ఒక గిఫ్ట్ పెట్టి పంపడం మన దేశ ఆనవాయితి..మహిళలైతే చీర పెట్టి పంపుతాం..ఇప్పుడు అదే సంప్రాదాయాన్ని ఇవాంక విషయంలో పాటిస్తన్నారు. యాభైఏండ్ల చరిత్ర కలిగిన గొల్లభామ చీరను సినీనటి ,చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంతా ,భారత్ కి వచ్చిన ఇవాంకకి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు..భారతదేశం అనగానే విదేశీ మహిళలకు ముందుగా గుర్తొచ్చేది చీరనే..మోడ్రన్ డ్రెస్ లు ధరించే విదేశియులు మన గడ్డపై అడుగుపెట్టాక ఒకసారన్నా చీరకట్టుకోవాలనేఆకాంక్షను నెరవేర్చుకుంటారు..ఇప్పుడు ఇవాంక కూడా ఆ కోరిక నెరవేరబోతుంది…మనదేశంలో,మన రాష్ట్రంలో ఎన్నోరకాల చీరలు ప్రసిద్ది అయినప్పటికీ గొల్లబామనే ఎందుకు సెలక్ట్ చేశారు.. ఇవాంకకి ఇవ్వబోయే గొల్లభామ చీర యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా…?

గొల్లభామ చీర ప్రత్యేకత..

  • సిద్దిపేటకు చెందిన గొల్లభామ చీరకు 50 ఏళ్ల చరిత్ర ఉంది.1940 ప్రాంతంలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన నేతన్నలు మొదటిసారి గొల్లభామ చీరలను డిజైన్ చేశారు
  • ఓ చేత్తో నెత్తిన పాల కుండ, మరో చేతిలో పెరుగు కుండ పట్టుకున్న గొల్ల్లభామ డిజైన్‌తో ఈ చీరలు ఆకట్టుకుంటాయి.
  • సిద్దిపేటకు చెందిన నేతన్నలు రచ్చ దేవదాస్, కొంక సాయిలు ఈ గొల్లభామ చీర సృష్టికర్తలు. వీరి అపూర్వ సృష్టి అయిన గొల్ల్లభామ చీర ప్రత్యేకతను భారత ప్రభుత్వం 2012లో గుర్తించింది.

  • గొల్లభామ చీరలు మిగతా చేనేత చీరల కన్నా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రధానంగా కాటన్‌, మాస్ర్టస్‌ అనే రెండు దారాలతో ప్రత్యేక మగ్గంపై ఈ చీరలను నేస్తారు. చీర నిండా బుటాల మాదిరిగా అంచులో అంతర్భాగంగా గొల్లభామలను నేయడం ఈ చీరల స్పెషాలిటీ. ఇలాంటి స్పెషాలిటీస్‌ వల్లే 2012లో సిద్దిపేట చేనేత సహకార సంఘం పేటెంట్‌ హక్కులు సైతం సాధించింది.
  • చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిష్ట్రీ ఈ చీరకు భౌగోళిక గుర్తింపును ఇస్తూ ప్రత్యేకమైన ఎంబ్లమ్ కేటాయించింది.
  • గత కొన్నేళ్లుగా చేనేతకు ప్రాధాన్యత తగ్గిపోతుండడంతో  తెలంగాణా ప్రభుత్వం చేనేతకు మళ్లీ చేయుతనందించే దిశగా అడుగులు వేసింది..అందులో భాగంగానే  సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.దీంతో  ‘గొల్లభామ’ బ్రాండ్‌కు మరింత గుర్తింపు దక్కింది.

గొల్లభామ చీరతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ గిఫ్ట్ బాక్స్‌ను ఇవాంకకు అందజేయనున్నట్లు   తెలుస్తోంది. ఈ చీర కూడా ఆ గిఫ్ట్ బాక్స్‌లో భాగంగానే ఇస్తారట. అంటే ఈ మొత్తం గిఫ్ట్ బాక్స్‌ను సమంత చేతుల మీదుగానే ఇవాంకకు అందించే అవకాశం ఉంది.

Comments

comments

Share this post

scroll to top