“సమంత – నాగ చైతన్య”ల పెళ్లి, ఎంగజ్మెంట్లకు “సమంత” తల్లితండ్రులు రాలేదా..? కారణం ఇదేనా..?

Krishna

ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను…. ఏం మాయ చేసావే సినిమా తో సమంతా చేసిన మాయ అంతా ఇంత కాదు..అబ్బాయిలతో పాటు అమ్మాయిలను మాయచేసింది..తన అందం,అభినయం మరియు వాయిస్ తో..సమంతాకి వాయిస్ ఇచ్చింది చిన్మయి అయినప్పటికీ ..అది వేరే విషయం..ఇప్పుడు చైతూ ని పెళ్లి చేసుకుని అక్కినేని కోడలిగా తెలుగు సినిమా ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది..ఇప్పుడు విషయం ఏంటంటే సమంతా పెళ్లికి సమంతా కుటుంబం రాలేదా… అవును,కాదు,ఏమో తెలిదు…స్పష్టమైన ఆన్సర్ మాత్రం రావట్లేదు..

గోవాలో జరుగుతున్న పెళ్లి గురించి నాగార్జున,సమంతా ట్విట్టర్ ద్వారా తెలుపుతూనే ఉండడంతో మిస్ అయిన ఫీలింగ్  అభిమానులకు కలగలేదు.మెహెందీ ఫంక్షన్,చైతూని పెళ్లికొడుకు చేయడం,రెండు పద్దతుల్లోని పెళ్లి ఫోటోలు,వీడియోలు ఇలా ఎప్పటికప్పుడు ట్విట్టర్లో దర్శనం ఇచ్చాయి..కానీ ఫోటోల్లో కనిపించనిదల్లా ఒకటే సమంతా కుటుంబం. అక్కినేని,దగ్గుబాటి,సమంతా.. కేవలం ఈ మూడు కుటుంబాల మధ్య సమంతా ,చైతన్య ఒకటి కాబొతున్నారనేది. మొదటి నుండి వినిపిస్తున్న మాట..కానీ కనిపించడం మాత్రం దగ్గుబాటి,అక్కినేని రెండుకుటుంబాలే కనిపిస్తున్నాయి.అక్కడక్కడ సమంతా ఫ్రెండ్స్ కనిపించారు. .. పెళ్లిలోనే కాదు నిశ్చితార్దంలో కూడా సమంతా కుటుంబం లేదు..అసలు ఇప్పటివరకు సమంతా ఫ్యామిలికి సంభందించిన ఏ ఒక్క ఫోటో కానీ,విషయాలు కానీ ఎవరికీ తెలీదు..అమ్మా,నాన్న,ఇద్దరు అన్నయ్యలున్నట్టు మాత్రం తెలుస్తుంది.

ఇతర భాషల నుండి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన కాజల్,శ్రీయ ఇతర హీరోయిన్ల ఫ్యామిలిలు, ఫోటోలు ఎప్పటికప్పుడు దర్శనమిస్తునే ఉంటాయి.కానీ స్టార్ హీరొయిన్ అయిన సమంతా ఫ్యామిలి గురించి మాత్రం  ఇప్పటివరకు ఎవరికీ తెలీదు..దీని వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి..సమంతా సినిమాల్లోకి రావడం,ఇప్పుడు ఈ ప్రేమ వివాహం వారి కుటుంబానికి  ఇష్టం లేదు అనేది ఒకటి..రెండోది సమంతా ఫ్యామిలి పెళ్లికి వచ్చారు బట్ వాళ్లెవరో మనకు తెలీదు కాబట్టి మనమే గుర్తుపట్టలేదు అని,మరోటి వాళ్లు ఎలా ఉంటారో బయటి ప్రపంచానికి తెలిస్తే ప్రైవసీ పోతుందని వాళ్లే వారి ఫోటోలు పెట్టొద్దని నాగార్జునని కోరినట్టు సమాచారం..ఇదిలా ఉంటే క్రిస్టియన్ పద్దతిలో జరిగిన వివాహంలో చైతూని స్టేజ్ పైకి నడుచుకుంటూ తీసుకొస్తున్న ఫోటోలో చైతూ వాళ్ల అమ్మ ఉంది..సమంతని కూడా సమంతా పెద్దన్నయ్య అలా తీసుకొచ్చాడని అంటున్నారు..ఇంతకుముందు నిశ్చితార్దంలో కూడా సమంతా పెద్దన్నయ్యే  సామ్ ని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు..

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సమంతా  మన తెలుగింటి కోడలు..సమంతా అక్కినేనిగా పేరు కూడా మారిపోయింది చాలా వాటిల్లో..కాబట్టి మెట్టినింట చైతన్య,సమంతా హ్యాపీగా ఉంటే చాలు..ఒన్స్ ఎగేన్ హార్టీ కంగ్రాట్స్..జెస్సీ&కార్తీక్…

Comments

comments