ఇప్పటివరకు చాలా మంది చూడని “సమంత” తల్లితండ్రులు వీరే..! పెళ్ళిలో ఇరు కుటుంబాలు కలిసి దిగిన ఫోటో..!

Krishna

ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను…. ఏం మాయ చేసావే సినిమా తో సమంతా చేసిన మాయ అంతా ఇంత కాదు..అబ్బాయిలతో పాటు అమ్మాయిలను మాయచేసింది..తన అందం,అభినయం మరియు వాయిస్ తో..సమంతాకి వాయిస్ ఇచ్చింది చిన్మయి అయినప్పటికీ ..అది వేరే విషయం..ఇప్పుడు చైతూ ని పెళ్లి చేసుకుని అక్కినేని కోడలిగా తెలుగు సినిమా ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది..ఇప్పుడు విషయం ఏంటంటే సమంతా పెళ్లికి సమంతా కుటుంబం రాలేదా…?

గోవాలో జరుగుతున్న పెళ్లి గురించి నాగార్జున,సమంతా ట్విట్టర్ ద్వారా తెలుపుతూనే ఉండడంతో మిస్ అయిన ఫీలింగ్  అభిమానులకు కలగలేదు.మెహెందీ ఫంక్షన్,చైతూని పెళ్లికొడుకు చేయడం,రెండు పద్దతుల్లోని పెళ్లి ఫోటోలు,వీడియోలు ఇలా ఎప్పటికప్పుడు ట్విట్టర్లో దర్శనం ఇచ్చాయి..కానీ ఫోటోల్లో కనిపించనిదల్లా ఒకటే సమంతా కుటుంబం. అక్కినేని,దగ్గుబాటి,సమంతా.. కేవలం ఈ మూడు కుటుంబాల మధ్య సమంతా ,చైతన్య ఒకటి కాబొతున్నారనేది. మొదటి నుండి వినిపిస్తున్న మాట..కానీ కనిపించడం మాత్రం దగ్గుబాటి,అక్కినేని రెండుకుటుంబాలే కనిపిస్తున్నాయి.అక్కడక్కడ సమంతా ఫ్రెండ్స్ కనిపించారు. .. పెళ్లిలోనే కాదు నిశ్చితార్దంలో కూడా సమంతా కుటుంబం లేదు..అసలు ఇప్పటివరకు సమంతా ఫ్యామిలికి సంభందించిన ఏ ఒక్క ఫోటో కానీ,విషయాలు కానీ ఎవరికీ తెలీదు..అమ్మా,నాన్న,ఇద్దరు అన్నయ్యలున్నట్టు మాత్రం తెలుస్తుంది.

అయితే ఈ ప్రశ్నలు అన్నిటికి ఒక క్లారిటీ వచ్చేసింది..సమంత తల్లితండ్రులు ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని , సమంత కుటుంబాలు కలిసి దిగిన ఫోటో మీరు ఒక లుక్ వేసుకోండి!

 

Comments

comments