గేదెలను కడిగే సీన్ లో “సమంత” ఏం చేసిందో తెలుస్తే షాక్ అవుతారు.! డైరెక్టర్ అలా చెప్పేసరికి.!

పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరం అవుతారు ..కాని అదేంటో సమంతా విషయంలో మాత్రం తారుమారు అయింది..పెళ్లి తర్వాతే సమంతా మరింత బిజి అయింది.అంతేకాదు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది.ఇటీవల రంగస్థలంలో రామలక్ష్మిగా అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది..ఈ సినిమాలో నటించిన నటులు తమ తమ పాత్రల్లో జీవించారని చెప్పాలి..కాని సమంతా గురించి ప్రత్యేకంగా చెప్పాలి..

ఈ రోజుల్లో హీరోయిన్లు డీ గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడట్లేదు..కొంచెం కష్టపడాల్సిన సీన్ చేయాలన్నా ప్రతి దానికి డూప్ ని పెట్టి చేయించాల్సిన పరిస్థితి..ఈ సినిమాలో అలాంటి సీన్లు బోలెడు..పొలం గట్లపై బరువులు మోస్తూ నడవటం, మండుటెండలో సైకిల్ ఎక్కి తొక్కటం, గడ్డి కోసుకుని తల మీద పెట్టుకుని ఇంటికి రావటం వంటి ఎన్నో పనులను చేసింది సమంత. ఇప్పటి వరకు సమంతా ఇటువంటి డీ గ్లామర్ పాత్రలను చేయలేదు. ఈ సినిమాలో పూర్తిగా సమంతాది డీ గ్లామర్ రోల్ రామలక్ష్మిగా నటించి మెప్పించింది.

ఈ సినిమాలో గేదెలను కడగటానికి ఒక డూప్ ని రెడీ చేశారట సుకుమార్..సమంతా చేయటానికి ఇబ్బంది పడే సీన్స్ ఆ డూప్ చేత చేయిద్దామని సుకుమార్ భావించాడట. అయితే సమంతా చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ ఆ సన్నివేశాలు అన్నీ తానే స్వయంగా చేసేసిందట. సుకుమార్ వద్దని వారించినా సమంతా ఆలా చేస్తేనే కదా పేస్ లో మంచి ఎక్స్ ప్రెషన్స్ వచ్చేది అంటూ డూప్ లేకుండా చేసేసిందట…కాళ్లకు చెప్పుల్లేకుండా నటించడం మరో విశేషం..నిజంగా డెడికేషన్ అంటే అలా ఉండాలి అని అందరూ ఇప్పుడు సమంతానే హాట టాఫిక్ గా మారింది.

Comments

comments

Share this post

scroll to top