వేరుశెనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే… రామలచ్చిమిలా అందరి మనసుల్ని దోచేసింది సమంతా..సినిమా రిలీజ్ అయ్యాక భర్త నాగచైతన్యతో హాలిడే ట్రిప్‌లో ఉంది.చై,సామ్ తొలిచిత్రం ఏం మాయ చేశావే షూటింగ్ జరిగిన న్యూయార్క్‌లో అప్పటి జ్ణాపకాలను నెమరేసుకుంటూ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు..దీంతో రంగస్థలం సక్సెస్ మీట్ లో పాల్గొనలేకపోయిన సమంతా ట్విట్టర్ వేదికగా అభిమానులను పలకరించింది.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా తన సమాధానాలను ఇచ్చింది…
ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీ జీవితంలో ఉత్తమమైన, మీరెప్పుడూ గుర్తు పెట్టుకునే రోజు ఏది? అని అడగ్గా.. సమంత ‘నా పెళ్లి రోజు’ అంటూ టక్కున బదులిచ్చింది. ‘అక్కినేని నాగచైతన్య భార్య.. నాగార్జున కోడలు.. లెజెండ్ ఏఎన్నార్ మనవరాలు.. వీటిలో ఏ విషయానికి మీరు ఎక్కువగా గర్వపడతారు’ అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సామ్ సరదాగా స్పందిస్తూ.. ‘ఇది కాస్త కష్టమైన ప్రశ్నే.. నా భర్తకు భార్యను కావడం’ అంది. ‘ఒత్తిడికి గురైతే ఏం చేస్తారు?’ అని ఓ అభిమాని అడగ్గా.. ‘నిద్రపోతా’ అని సమంత చెప్పింది. ‘సమంతా.. మీరు అబ్బాయై ఉంటే.. ఏ హీరోయిన్‌పై క్రష్ ఉండేది?’ అని అడిగిన ప్రశ్నకు సామ్ ఏమాత్రం తడుముకోకుండా ‘దీపికా పదుకొనే’ అంటూ బదులిచ్చింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలు..సమంతా సమాధానాలు..
- అక్కినేని చైతన్యలో మీకు బాగా నచ్చిన విషయం?
అతడు చై అక్కినేని కావడం.. - ఉపాసన, రామ్‌చరణ్ జంట గురించి ఒక్క మాటలో చెప్పండి?
ఒకరికొకరు సరైన జోడీ. - సమంతా.. మీరు ఏ సెంట్ వాడుతారు?
బైరైడో వెల్వెట్ హేజ్. - సుకుమార్ ‘రంగస్థలం’ కథతో వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
అదృష్టంగా భావించా.
- ‘రంగస్థలం’ సినిమా కోసం రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
ది బెస్ట్. ఆయన చాలా సౌమ్యుడు. - మీ దృష్టిలో అందం అంటే..?
గొప్ప వ్యక్తిత్వం. - తెలుగు, తమిళంలో ఇటీవల ఏ నటైనా మిమ్మల్ని బాగా మెప్పించిందా?
సాయిపల్లవి. - సోషల్‌మీడియాలో మీకు ఇష్టమైన ఖాతా ఏది?
ప్రస్తుతం.. ఇన్స్టాగ్రామ్. - సమంతా.. మీ పెళ్లి ఫొటోలు ఇంకొన్ని పోస్ట్ చేయొచ్చుగా?
తప్పకుండా…