టాలీవుడ్ తరలివచ్చిన వేళ: ఘనంగా జరిగిన “సమంత – చైతన్య” రిసెప్షన్.! ఫుల్ వీడియో మీకోసం!

అక్టోబర్ 12న గోవాలో అత్యంత ఘనంగా హిందూ-క్రిస్టియన్ పద్ధతుల్లో అక్కినేని నాగచైతన్య-సమంతల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత దగ్గుబాటి వారి కుటుంబం కోసం ఒకసారి, అక్కినేని వారి కుటుంబం కోసం ఇంకోసారి రెండు రిసెప్షన్లను ఏర్పాటు చేశారు. అయితే.. అక్కినేని అభిమానులకు మాత్రం తమ అభిమాన కథానాయకుడు నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్యను ఆయన సతీమణి సమంత సమేతంగా చూసుకోవాలన్న కోరిక మాత్రం తీరలేదు. పెళ్ళికి ముందే నాగార్జున హైద్రాబాద్ లో ఒక రిసెప్షన్ ను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో నిర్వహించడంతోపాటు అభిమానులను కూడా పిలుద్దామనుకొన్న విషయం తెలిసిందే.

పెళ్లై దాదాపు నెల రోజుల తర్వాత ఆ శుభముహూర్తం సెట్ అయ్యింది. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. నవంబర్ 12 (ఆదివారం) హైద్రాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది వచ్చారు. మెగా ఫామిలీ, అక్కినేని ఫామిలీ, దగ్గుబాటి ఫామిలీ లతో సంబరాలు అంబరాన్ని తాకాయి.

watch full video:

Comments

comments

Share this post

scroll to top