సమంత – నాగ చైతన్య పెళ్లిపై కొత్త అప్డేట్..! రెండు సార్లు పెళ్లట…! పెళ్లి ఎప్పుడో తెలుసా..?

సమంత – నాగ చైతన్య పెళ్లి..! గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతున్న వార్త. ఎంగేజ్మెంట్ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిందే. ముందు అఖిల్ పెళ్లి, తరవాత చైతన్య పెళ్లి అని అక్కినేని వారి కుటుంబం చెప్పింది. కానీ అనుకోకుండా “అఖిల్ – శ్రియ” పెళ్లి కాన్సల్ అయ్యింది. దీంతో సినీ వర్గాలు సమంత – చైతన్యల పెళ్లి విషయమే మర్చిపోయాయి. వరుస సినిమాలకు కమిట్ అవుతూ చైతూ, సమంతలు కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దా సినిమా షూటింగ్ పూర్తి చేసి చైతూ, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. వీటితో పాటు ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఈ రెండు సినిమాలను జూలై నుంచే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.

సమంత కూడా ఇదే స్పీడులో సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే నాగార్జునతో కలిసి రాజుగారి గది 2లో, రామ్ చరణ్ సుకుమార్ సినిమాల్లో నటిస్తున్న సమంత ఈ రెండూ పూర్తవ్వగానే మహానటి షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంది. అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు విశాల్ కొత్త సినిమాకు ఓకె చెప్పే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జంట కమిట్ అయిన సినిమాలు పూర్తవ్వటానికి మరో ఏడాది సమయం పడుతుంది.

కానీ అక్కినేని వారి కుటుంబం మాత్రం “అక్టోబర్” లో పెళ్లి అని సమాచారం ఇచ్చింది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఈ లెక్కన చూస్కుంటే కొద్ది రోజులు సినిమాలకు సెలవు చెప్పి వారు పెళ్లి చేసుకుంటారన్న మాట. పెళ్లి రెండు సార్లు జరుగుతుంది అంట. ముందు హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకొని, తరవాత క్రిస్టియన్ మతం పరంగా పెళ్లి చేసుకుంటారట “చైతన్య – సమంత” లు. ముహూర్తంతో సంబంధం లేకుండా “అక్టోబర్ 6 ” న వీరిద్దరి పెళ్లి జరుగుతుంది అంట!

Comments

comments

Share this post

scroll to top