మిస్ వరల్డ్ “మానుషి”కి, అక్కినేని కోడలు “సమంతా”కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా.? ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా..!

17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించింది  మానుషి చిల్లర్. ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకోవడంతో.. మానుషి ఓవర్ నైట్‌లోనే సెలబ్రిటీ అయిపోయింది. ప్రపంచ దేశాల్లో మానూషి పేరుతో పాటు భారత్ పేరు మార్మోగిపోయింది. ఎవరీ మానుషి చిల్లర్ అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.అప్పుడే ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ బయటికొచ్చింది..అదేంటంటే మిస్ వరల్డ్‌, ప్రముఖ హీరోయిన్ సమంత మధ్య సంబంధం ఉందనే వార్త …ఇంతకీ వీరిద్దరి మద్య సంభందం ఎలా..?

మానూషి సొంతూరు హర్యానా .  సమంతా దక్షిణాది అమ్మాయి..వీరిద్దరికి లింక్ ఎలా …మానుషి మా ఊళ్లోనే కూచిపూడి నేర్చుకుందంటూ బెంగళూరు వాసులు  తెగ హ్యాపీగా ఫీలయ్యారు.  నార్త్‌లో పెరిగిన మానుషికి బెంగళూరులో సమంతతో పరిచయం ఏర్పడిందా..? ఇద్దరూ ఫ్రెండ్సా? అనే ప్రశ్నలు..ఇంతకూ ఈ ఇద్దరు బ్యూటీల మధ్య సంబంధం ఏంటంటే.. మిస్ వరల్డ్ తుది పోటీ సందర్భంగా.. మానుషి ఎలాంటి డ్రెస్‌లో తళుక్కుమందో గుర్తుందా..? దాన్ని ప్రముఖ డిజైనర్లు ఫాల్గుణి, షెనే డిజైన్ చేశారు. ఆ దుస్తుల్లోనే మానుషి మరింత అందంగా కనిపించింది. వెడ్డింగ్, రిసెప్షన్‌లో సమంత వేసుకున్న దుస్తులను కూడా వీరే డిజైన్ చేశారు. అదన్నమాట సమంతకు, మానుషికి మధ్య సంబంధం. ఓర్నీ ఇంతేనా అనుకుంటున్నారా..? ఫేమస్ అయిపోయిన వాళ్లకు మనతో కానీ, మనకు తెలిసిన వాళ్లతో కానీ ఏదైనా సంబంధం ఉందని తెలిస్తే థ్రిల్‌గా ఫీలవుతాం కదూ.ఇదీ అంతే…

ఆమె కులం, పెరిగిన నేపథ్యం తదితర వివరాలు తెలుసుకోవడానికి ఇప్పటికే నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు..మీరు కూడా సెర్చ్ చేసి మీకు మానుషి కి ఏమన్నా సంభందం ఉందేమొ చూడండి..

Comments

comments

Share this post

scroll to top