హీరోయిన్ లలో నెంబర్ వన్ స్థానానికి పోటీ ఎవరి మద్యో తెలుసా..?

ఆట అయినా, చదువైనా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకు అంటూ ఈ ర్యాంకుల గొడవ ఉండనే ఉంటుంది. మరి  వెండితెర మీద నటిస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు, ఈలలు కొట్టిస్తున్న వారికి  ఉండదా…? ఏదైనా రేసు రేసే… ఫస్ట్ సెకండ్ ర్యాంకింగ్ లు కామనే.. మరి మన టాలివుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు?  అంటే  సమాధానం మాత్రం మేము చెప్పలేము… ఎందుకంటే ఎవరికి వారే తోపు… ఏ సినిమా ట్రెండ్ లో ఉంటే వాళ్లే పెద్ద హీరో…కానీ రేస్ మాత్రం పవన్, మహేష్ ల మద్య అని తరచుగా వినిపిస్తుంటుంది.
హీరోల సంగతి పక్కన పెట్టి  హీరోయిన్స్ విషయానికి వస్తే…  ఈ పోటీ ఇద్దరి మద్య ఉంది …! వాళ్లెవరో తెలుసా సమంత, శృతిహాసన్….. ఈ ఇయ‌ర్‌లో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తితో  సమంత సక్సెస్ సాధిస్తే,  శృతి  శ్రీమంతుడు సినిమా తో హిట్ కొట్టింది. ఈమె ఖాతా లో రేసుగుర్రం, ఎవడు సినిమాలు ఉండనే ఉన్నాయి..గబ్బర్ సింగ్ కూడా మేడమ్ సినిమానే.
Samantha And Shruti Got More Chances In Kollywood,kollywood,tamil offers,kollywood latest news,Nayanthara,Hansika,tamil movies,Samantha box office offers,telugu movies world,Samantha hits1
సమంత కు కూడా హిట్స్ బాగనే ఉన్నాయి   దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేదీ , మనం..  సినిమాల హిట్లతో మంచి ఊపు మీదనే ఉంది సమంత.   ఇద్దరికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది టాలీవుడ్ లో … నెంబర్ వన్ ఎవరో తేల్చాల్సింది మాత్రం అల్టిమేట్ గా ప్రేక్షకులే. మరి మీ ఓటు ఎవరికి?

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top