ఆ గ‌ర్భిణీ చ‌నిపోగా స‌మాధిలో పూడ్చారు. త‌రువాత ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. షాకింగ్‌..!

ఇప్పుడంటే అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉంది కాబ‌ట్టి ప్రాణాపాయంలో ఉన్న మ‌నిషినైనా ర‌క్షించ గ‌లిగే వైద్య స‌దుపాయాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక‌ప్పుడు అలా కాదుగా. ఇంకా చెప్పాలంటే.. అది క్రీస్తు పూర్వం నాటి మాట‌. అప్పుడు అస‌లు వైద్యం అనేది లేదు. ఇంకా పుట్ట‌లేదు. దీంతో ఏ చిన్న వ్యాధి సోకినా మ‌ర‌ణించేవాళ్లు. అలా ఓ 25 ఏళ్ల యువ‌తి చ‌నిపోయింది. అయితే అప్ప‌టికే ఆమె గ‌ర్భిణీ. కానీ చ‌నిపోవ‌డం వ‌ల్ల ఆమెను పూడ్చి పెట్టారు. అయితే విచిత్రంగా ఆమె చ‌నిపోయాక స‌మాధిలో పూడ్చాక ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. గ‌ర్భంతో ఉన్న ఆ యువ‌తి వ్యాధి కార‌ణంగా చ‌నిపోయింది. కానీ ఆమెను స‌మాధిలో పూడ్చాక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదే విష‌యాన్ని ఇట‌లీకి చెందిన పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. వారు అక్క‌డ ఇటీవ‌లే త‌వ్వ‌కాల్లో మ‌ధ్య‌యుగ కాలం నాటి ఓ యువ‌తి అస్థిపంజ‌రాన్ని క‌నుగొన్నారు. దాన్ని ప‌రిశీలించిన సైంటిస్టులు ఆ విష‌యం చెప్పారు. ఆ యువ‌తికి 25 ఏళ్లు ఉంటాయ‌ని, ఆమె చ‌నిపోయే నాటికి 38 వారాల‌ నిండు గ‌ర్భిణీ అని, అయితే ఆమెకు అరుదైన మెద‌డు సంబంధ వ్యాధి రావ‌డంతో ఆమెకు బ‌ల‌వంతంగా డెలివ‌రీ చేయాల‌ని య‌త్నించార‌ని, అందువ‌ల్ల ఆమె చ‌నిపోయింద‌ని సైంటిస్టులు గుర్తించారు.

స‌ద‌రు మెద‌డు సంబంధ వ్యాధికి అప్ప‌ట్లో ఎలాంటి చికిత్స లేనందువ‌ల్లే వారు క‌నీసం క‌డుపులో ఉన్న బిడ్డ‌ను అయినా ర‌క్షించాల‌నే ఉద్దేశంతో ఆ యువ‌తికి డెలివ‌రీ చేయాల‌ని చూశార‌ట‌. కానీ ఆ యువ‌తి దుర‌దృష్ట‌వ‌శాత్తూ చ‌నిపోయింద‌ట‌. దీంతో ఆమెను స‌మాధిలో పూడ్చారు. ఆశ్చ‌ర్యంగా స‌మాధిలో పూడ్చాక ఆమె బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ట‌. స‌ద‌రు యువ‌తి అవ‌శేషాల‌ను ప‌రిశోధించిన సైంటిస్టులు ఈ విష‌యం చెప్పారు. ఆమె పుర్రెపై రంధ్రం ఉంద‌ని, క‌నుక ఆమెకు మెద‌డు సంబంధ వ్యాధి వ‌చ్చి ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు. ఇక ఆ యువ‌తిని పూడ్చి పెట్ట‌బ‌డిన ఘ‌ట‌న‌ క్రీస్తు పూర్వం 7 లేదా 8వ శ‌తాబ్దంలో జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. కాగా ఈ విష‌యాల‌ను ఫెరారా, బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగజైన్‌లో ప్రచురించారు. ఏది ఏమైనా నిజంగా ఇది చాలా షాకింగ్ న్యూస్ క‌దా..!

Comments

comments

Share this post

scroll to top