చిన్నప్పుడే పోలీయోతో రెండు కాళ్లు కోల్పోయాడు, కానీ ధైర్యాన్ని కాదు. ట్రాఫిక్ వార్డెన్ గా విధులు నిర్వర్తిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు సల్మాన్.

ఏదైనా చేయాలనే సంకల్పం మనసులో బలంగా ఉంటే చాలు. అందుకు ఏవీ అడ్డురావనే సత్యాన్ని నిరూపించాడు బెంగుళూరుకు చెందిన ఆ యువకుడు. పోలియో కారణంగా రెండు కాళ్లను కోల్పోయినా అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ట్రాఫిక్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనే సల్మాన్. బెంగుళూరులో నివాసం ఉండే మహమ్మద్ సల్మాన్‌కు ఇప్పుడు 20 ఏళ్లు. చిన్నతనంలో అతను తమ ఇంటి వద్ద రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులను నిత్యం చూసేవాడు. వారి పట్ల అతనికి ఆసక్తి కలిగేది. తాను కూడా పెద్దయ్యాక ట్రాఫిక్ అధికారి కావాలని కలలు కన్నాడు. అయితే అతను టీనేజ్ వయస్సులో ఉండగానే అనుకోకుండా సంభవించిన పోలియా కారణంగా తన రెండు కాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. కాగా దీనికి సల్మాన్ ఏమాత్రం కుంగిపోలేదు. ట్రాఫిక్ అధికారి కావాలనుకున్న తన ప్రయత్నాన్ని కొనసాగించాడు.
681864974
ఈ నేపథ్యంలోనే అతను 2012లో స్థానిక శివాజీనగర్ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాడు. తన మనసులో ఉన్న మాట వారికి చెప్పాడు. ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించాలని ఆసక్తిగా ఉందని వారికి తెలియజేశాడు. దీంతో ఆ అధికారులు ఆశ్చర్యపోయారు. కాళ్లు లేకపోయినా ట్రాఫిక్ సిబ్బందిగా పనిచేసేందుకు ముందుకు వచ్చిన అతని అంకితభావాన్ని చూసి వారు విస్మయానికి లోనయ్యారు. అయితే వారు సల్మాన్ పట్ల కరుణ ప్రదర్శించారు. ట్రాఫిక్ వార్డెన్‌గా అతన్ని నియమించుకున్నారు. అప్పటి నుంచి సల్మాన్ కోల్స్ పార్క్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న హెన్స్ సర్కిల్‌లో ట్రాఫిక్ వార్డెన్‌గా విధులు నిర్వహించడం ప్రారంభించాడు.
142456387
అయితే కేవలం ట్రాఫిక్ విభాగంలో చేరడంతో మాత్రమే అతను తన పని అయిపోయిందని భావించలేదు. నిత్యం విధులకు హాజరై ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడంలో జాగరూకుడిగా వ్యవహరించేవాడు. అంతేకాదు ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగితే వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించేవాడు. అంగ వైకల్యం బాధిస్తున్నా తన కలను నిజం చేసుకుని ముందుకు సాగుతున్న సల్మాన్ జీవితం అతని లాంటి మరెందరో వికలాంగులకు ప్రేరణగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదేమో!

Comments

comments

Share this post

scroll to top