ప‌ర్యావ‌ర‌ణ హిత‌మే వారి మ‌తం- స‌ల్మాన్ ఖాన్ నే క‌ట‌క‌టాల్లోకి పంపించారు.!

1998 సెప్టెంబర్ 26వ తేదీన ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సమీపంలో కంకనీ అనే గ్రామం వద్ద కృష్ణ జింకలను వేటాడిన కేసుకు సంబంధించి జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా ప్రకటించి, ఐదేళ్లు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ క్ర‌మంలో రెండు రోజులు జైల్లో గ‌డిపిన స‌ల్మాన్ బెయిల్ పై విడుద‌ల‌య్యాడు.

స్టార్ హీరో…జైల్లో ఖైదీగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాత్రం… బిష్నోయి తెగ‌కు చెందిన వారు…ఈ కేసు ప్రారంభం నుండి స‌ల్మాన్ జైలుకు వెళ్ళే వ‌ర‌కు ప‌ట్టువ‌ద‌ల‌కుండా పోరాటం చేసింది వీరే.! అస‌లు స‌ల్మాన్ కేసుకు, ఆ తెగ‌కు మ‌ధ్య సంబంధమేంటి అనేది క్షుప్తంగా తెలుసుకుందాం.

20 (బీస్), 9 (నౌ) కలిసి బిష్నోయి అయ్యింది. వీరి ఆరాధ్య గురువు జంభేశ్వర్…ఆద‌ర్శ జీవ‌నం కోసం 29 నియ‌మాల‌ను బోధించాడు..వాటిని క‌లిపే… బీస్(20)+నౌ(9)= బిస్నౌ…బిష్నో…బిష్నోయ్…అయ్యింది. అందులో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, భూత ద‌య ముఖ్య‌మైన‌వి. వ్య‌వ‌సాయం, ప‌శుపోష‌ణే ప్ర‌ధాన వృత్తి కావ‌డం చేత ఈ తెగ‌వారు స‌హ‌జంగానే వాటిపై అధిక భ‌క్తి భావాన్ని క‌ల్గి ఉంటారు. వాటిని కాపాడే క్ర‌మంలో…త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌రు. ఇలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ తెగ‌కు చెందిన దాదాపు 1000 మంది చెట్ల‌ను, మూగ జీవాల‌ను కాపాడే క్ర‌మంలో ప్రాణాలు కోల్పోయారు. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు మ‌న‌కు జింక‌ల‌కు త‌ల్లులు పాలు ప‌ట్టే విధంగా క‌నిపించే ఫోటోలోని మ‌హిళ‌లు ఈ తెగ‌కు చెందిన వారే..దీనిని బ‌ట్టి చెప్పొచ్చు..ఈ తెగకు మూగ‌జీవుల ప‌ట్ల ఎంత ప్రేముందో.!

20 సంవ‌త్స‌రాల క్రితం కంకనీ అనే గ్రామంలో…స‌ల్మాన్ కృష్ణ‌జింక‌ల‌ను వేటాడాడు. ఈ గ్రామంలో బిష్నోయి జ‌నాభా అధికం. త‌మ క‌న్న బిడ్డ‌లాంటి జింక‌ను చంప‌డంతో…స్టార్ హీరో అని కూడా చూడ‌కుండా వారంతా తిర‌గ‌బ‌డ్డారు. వీరికి హ‌ర్యాణ‌, పంజాబ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బిష్నోయిలు కూడా స‌పోర్ట్ ఇవ్వ‌డంతో… కేసు తీవ్ర‌త పెరిగింది. కేసును నీరు గార్చే ప్ర‌య‌త్నాలు ఎన్ని జ‌రిగిన‌ప్ప‌టికీ….బిష్నోయి తెగ ఐక్య‌త ముందు నిలువ‌లేక‌పోయాయి..అలా స‌ల్మాన్ కు జైలు కూడు తినిపించ‌డంలో బిష్నోయిలు స‌క్సెస్ అయ్యారు.

Comments

comments

Share this post

scroll to top