సల్మాన్ కేసు కాగితాలు కాలిపోయాయా ??

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కేసు కొత్త మలుపు తిరిగుతుంది. పది రోజుల క్రితమే ముంబాయి కోర్ట్ సల్లూ భాయ్ కి బెయిల్ కన్ఫాం చేసింది.. అప్పుడే దీనిపై పెద్ద దుమారం రేగింది. పెద్దల చొరవ తోనే హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు బెయిల్ దొరికిందని వెబ్ మీడియా లో పుకార్లు షికారు చేశాయి.ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా  కేసులోని కొత్త కోణం బయటపడింది. సల్మాన్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్టీఐ ఉద్యమ కారుడు మన్సూర్ దర్వేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు .. ఆ పేపర్లు కాలిపోయాయని ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం వచ్చింది.

salmankhan-court

2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర వివరాలను తెలుసుకునేందుకు దర్వేష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అయితే ఆ కేసుకు సంబంధించి తమ దగ్గర ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని.. జూన్ 21, 2012న సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సల్మాన్ కేసు పేపర్లు బూడిద అయిపోయాయని ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు.  కేసు ఇంకా కోర్టులోనే ఉంది.. కేసుకు సంబంధించిన ఫైల్ కాలి బూడిదైందని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే సెలవిస్తున్నారు. ఇక కేసు సంగతి అంతే సంగతులా???

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top