చరిత్ర చెప్పిన ప్రేమ…సలీం అనార్కలీ.! చివరకు సజీవ సమాధి అయిన అనార్కలీ.!

మహాసామ్రాట్‌ అక్బర్‌  కుమారుడైన సలీం అనారు పూల తోటలో కనిపించిన సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె అసలు పేరు నదీరా. అప్పుడాయన కూడా సామాన్య సైనికుడి వేషంలోనే వుంటాడు. యువరాజునని చెప్పకుండా అసలు సంగతి దాచిపెడతాడు. ఆ సమయంలోనే అక్బర్‌ అటుగా రావడంతో తప్పుకుంటాడు. అక్బర్‌ కూడా ఆమె గాన నాట్యాలకు ముగ్దుడై ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. ఆ తోటలో కనిపించింది గనక అనార్కలి బిరుదునిస్తాడు. సలీంమేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌  ఈ ప్రేమ విషయం తెలుసుకుని అనార్కలిని మరచిపొమ్మని హెచ్చరిస్తాడు. పైగా సలీంను తనతో యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడితే సలీం తనను తెచ్చుకుంటాడు. తర్వాత అతను యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలతో చేసి కాపాడుకుంటుంది. అయితే అతను మామూలు సైనికుడు కాదని  అక్బర్ కొడుకని  తెలుసుకుంటుంది.

Shahjahan-and-Mumtaz-love-story

దాంతో అనార్కలి అతనిని ప్రేమించడానికి సంకోచిస్తుంది. దీంతో  నాట్యంతో మెప్పించి ప్రేమ వరం పొందవచ్చని సలీం నచ్చజెబుతాడు. సలీంపై ఎప్పటినుంచో ఆశలు పెంచుకున్న గుల్నాం ఆమె నాట్య ప్రదర్శన రోజున మత్తు కలిపిన పానీయం ఇచ్చి మోసం చేస్తుంది. దాంతో అనార్కలికి శిక్ష పడుతుంది. ఆ సమయంలో సలీం తన ప్రేమ సంగతి తల్లి జోదాభాయికు చెప్పి గట్టిగా వాదిస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది. తండ్రిపై వేటు వేయబోయి తల్లిని చూసి ఆగిపోతాడు సలీం. అక్బర్‌ పాదుషా వారిద్దరికీ మరణ శిక్ష విధిస్తాడు. అయితే కుమారుడికి అమలు చేయడు. అతను వచ్చే సరికి అనార్కలికి మాత్రం సజీవ సమాధి కట్టేస్తారు.

anarkali-salim

 

Watch Video Saleem Anarkali Superb Song:

Comments

comments

Share this post

scroll to top