“ధోని” ని అవమానించిన “పూణే” జట్టు ఓనర్ పై “సాక్షి” ఎలా స్పదించిందో తెలుసా..? తగిన గుణపాఠమే నేర్పింది!

భారత మాజీ సారధి “మహేంద్ర సింగ్ ధోని” పై “రైసింగ్ పూణే సూపర్ జైన్ట్స్”  యజమాని ఎలాంటి సంచలమైన ట్వీట్లు చేసి అవమానించాడో తెలిసిందే. మొదటి మ్యాచ్ లో “స్మిత్” బాగా ఆడినందుకు. ” “స్మిత్” ను కెప్టెన్ చేసి మంచి పని చేసాము. అడవికి రాజు అని నిరూపించుకున్నాడు” అని ట్వీట్ చేసాడు. అక్కడితో ఆగకుండా రెండో మ్యాచ్ లో “ధోని” బాటింగ్ లో విఫలం అవ్వడంతో మరోసారి ట్వీట్ చేసాడు “హార్ష్”. బాటింగ్ స్టాటిస్టిక్స్ పెట్టి ధోని స్ట్రైక్ రేట్ పై కామెంట్ చేసాడు. దీనిపై ఫాన్స్ అందరు ట్విట్టర్ వార్ కి దిగారు.

ఎప్పుడు కూల్ గా ఉండే “ధోని” ఇలాంటివి పట్టించుకోడు కాబట్టి ఏ రకంగా స్పందించలేదు. ధోని భార్య “సాక్షి” ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి “హార్ష్” ను చెంప మీద  కొట్టినంత రిప్లై ఇచ్చింది. జీవితంలో ఎవ్వరికైనా ఆ మాటలు చాలా ఉపయోగపడతాయి. ఇంతకీ ఏమని స్పందించిందో చూడండి!

ఇంస్టాగ్రామ్ వేదికగా రెండు ఫోటోలు పోస్ట్ చేసారు “సాక్షి ధోని”.. ఒక ఫొటోలో “చెన్నై సూపర్ కింగ్స్” డ్రెస్ వేసుకొని, నెక్స్ట్ ఇయర్ మరోసారి ఎంట్రీ ఇవ్వనుంది అని చెప్పారు. నిజానికి ధోని ఫాన్స్ అందరు కూడా “ధోని” చెన్నై టీం కి రావాలని కోరుకుంటూ ఉన్నారు. మరొక ఫొటోలో జీవితానికి ఉపయోగ పడే ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. అదేంటో చూడండి!

“పక్షి బతుకున్నప్పుడు చీమల్ని తింటుంది..
అదే పక్షి చనిపోయాక ఆ శవాన్ని చీమలు తింటాయి..”

కాలాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి. ఈ రోజు నువ్వు బలంగా ఉన్నవని ఎదుటి వారిని కించపరచకు, అవమానించకు. నీకంటే కాలం బలమైందని గుర్తుపెట్టుకో.

ఒక చెట్టు ద్వారా ఎన్నో అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు..
కానీ ఒక అగ్గిపుల్ల వల్ల అడవిలో ఉన్నా చెట్లన్నీ కాలిపోగలవు..”

నువ్వు మంచిగా ఉంది..నలుగురికి మంచి చెయ్యి..అంతేకాని ఎదుటివారిని అవమానించకు అని చెప్పకనే చెప్పారు “సాక్షి ధోని”. దీనిపై నెటిజన్లు అందరు హర్షం వ్యక్తం చేసారు!

A post shared by Sakshi (@sakshisingh_r) on

Comments

comments

Share this post

scroll to top