వారికి దేవుడి కంటే సైనికుడే ఎక్కువ. అందుకే అతని కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు.!

ఆస్ట్రేలియాకు వెయ్యి కి.మీ దూరంలో దక్షిణ  ఫసిఫిక్ ప్రాంతంలో వనౌతు దీవుల సముదాయంలో టన్నా అనే దీవి ఉంది.  ఈ దీవి దగ్గరలో మౌంట్ యాసుర్ ట్రైబల్ అనే గ్రామం ఉంది . అక్కడ కార్గో తెగకు చెందినవారు జీవనం సాగిస్తున్నారు.  మొత్తం 6 వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అమెరికా జెండా ఎగురవేస్తారు. అలాగే ప్రతి ఏడాది ఫిబ్రవరి 15 నాడు అమెరికా జెండా ఎగురవేసి సైనిక కవాతు ఏర్పాటుచేసి, నృత్యాలు, వాయిద్యాలతో, డప్పులు మోగించుకుంటూ సంతోషంగా ఉంటూ జాన్ ఫ్రమ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారి  తెగను అందరు  జాన్ ఫ్రమ్ తెగగానే పిలుస్తున్నారు. అమెరికా సైనికులు తమను తాము ‘ ఐ యామ్ జాన్ ఫ్రమ్ మియామి’, ‘ఐ యామ్ జాన్ ఫ్రమ్ కాలిఫోర్నియా’ అని వారితో పరిచయం  చేసుకుంటారట. అందుకని వారు అమెరికా సైనికులను  ‘జాన్ ఫ్రమ్’ గానే గుర్తుకుపెట్టుకున్నారు.

tarzan-shows-the-way-364x245
బ్రిటీష్, ఫ్రెంచ్ పాలనలో కార్గోతెగ ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తినడానికి తిండిలేని పరిస్థితిని గడిపారు. అయితే రెండో ప్రపంచ యుద్ధ దశకంలో 1940లో అమెరికా నేవీ సైన్యం ఆహార పదార్థాలు మరియు చమురు నిల్వలతో కార్గో తెగ ఉన్న దీవికి తరలివచ్చారు. ఆ దీవిలోనే రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకు నివాసం ఏర్పచుకొని ఉన్నారు. అందుకోసం తాత్కాలికంగా వైద్యం కోసం హాస్పిటల్స్, విమానాలు రాకపోకలకు ఎయిర్ స్కిప్ట్ లను నిర్మించుకున్నారు. ఇదే సమయంలో కార్గో తెగ ప్రజలతో సావాసం చేసుకొని, వారితో మంచిగా మెలిగి, వారికి ఆహారం, వైద్యం, అందించడంతో వారితో పాటు తెచ్చుకున్న బహుమతులను వారికి ఇచ్చారు.  ఇక అప్పటినుండి జాన్ ఫ్రమ్ తెగవారు వారిని మరచిపోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా సైనికులలోని జాన్ అనే అతడిని మాత్రం ఎక్కువగా ఆరాధిస్తుంటారు. తరాలు మారినా జాన్ అనే సైనికుడి విగ్రహాన్ని  చేసుకొని  అతడినే ఇప్పుడు దేవుడిగా కొలుస్తున్నారు. మమ్మల్ని చూడడానికి అతను మరలా వస్తాడన్న నమ్మకంతో ఇంకా ఎదురుచూస్తున్నారు.
గిరిజన ప్రజలైనా, ప్రపంచానికీ దూరంగా ఉన్నా, అందరితో మాత్రం నాగరికత తెల్సిన వారిలా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడు పర్యాటకులు కూడా ఇక్కడికి వెళ్తుంటారట. ఈ ఫిబ్రవరి 15 కూడా అమెరికా జెండా ఎగురవేసి పండుగచేసుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top