“వరుస అవకాశాలు సంపాదిస్తున్నావు జాగ్రత్త.!” – ప్రియా ప్రకాశ్ కి సాయిపల్లవి వార్నింగ్..! అసలేమైంది.?

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఒక్కసారి కన్నుగీటిన సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క సినీమా ఇండస్ట్రీనే కాదు..పాలిటిక్స్, క్రీడారంగం వారిని కూడా ఆకర్షించింది..ఇక సెలబ్రెటీలు అయితే ప్రియా ప్రకాశ్ కి ఫిదా అయ్యామంటూ ట్విట్స్ పెట్టారు. స్టార్ హీరోయిన్లకు వచ్చిన క్రేజ్ ప్రియాకు ఒక్క నైట్ లోనే వచ్చేసింది. అంతే కాదు ప్రియా ప్రకాశ్ నటించిన పాటపై ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి..కోర్టు వరకు వెళ్లింది..అయితే కోర్టులో ప్రియాకు ఊరట లభించింది.


ఒక్కసారిగా పెరిగిపోయిన క్రేజ్ తో ఆమె కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మలయాళ, తమిళ, తెలుగు నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎవరూ వెనుకాడకపోవడం విశేషం. ఇండస్ట్రీలో ఎంత స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్లు అయినా..ఒకానొక టైమ్ లో పూర్తిగా కనుమరుగైన రోజులు ఉన్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..’ఫిదా’హీరోయిన్ సాయి పల్లవి..ప్రియా ప్రకాశ్ కి కొంత హితభోద చేసింది.


ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఛాన్సులు సంపాదించుకుంటోన్న ప్రియా ప్రకాశ్ ఇకపై చాలా జాగ్రత్తగా వుండాలని సాయిపల్లవి అంది. స్టార్ డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలాకష్టమని చెప్పింది.
ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలనీ, పారితోషికం గురించి కాకుండా కథా కథనాలు .. పాత్రను గురించి ఆలోచించాలని చెప్పింది. కెరీర్ పరంగా తనలా ఆలోచించి స్టెప్పులు వేయాలంటూ..చిన్నపాటి వార్నింగే ఇచ్చినట్లు కనిపిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top