“సాయి పల్లవి” డాన్సర్ అనే అందరికి తెలుసు..! కానీ పాట పాడి చిన్నారిని ఎలా నిద్రపుచ్చిందో చూడండి! [VIDEO]

సాయిపల్లవి  ప్రాంతాలకు,భాషకు సంభందంలేకుండా అభిమానులను సంపాదించుకుంది.తెలుగులో ఫిదా చేయడానికి ముందే ఆమె మళయాలంలో నటించిన ప్రేమమ్ మూవీతో అందరిని తనకు ఫిదా చేసుకుంది.ప్రేమమ్ లో మలర్ క్యారెక్టర్ లో ఎంతగా ఒదిగిపోయింది అంటే తెలుగు ప్రేమమ్ లో మలర్ క్యారెక్టర్ కి శృతిహాసన్ ని పెడితే ,మలర్ క్యారెక్టర్లో వేరొకర్నీ ఊహించుకోలేము అని ప్రేక్షకులు రిజక్ట్ చేసేంత.కానీ అప్పటికి సాయిపల్లవి తెలుగులో సినిమాలు చేయలేదు.మళయాలి  సినిమాతోనే అంతమంది అభిమానులను సంపాదించుకుంది.

ఆ తర్వాత ఫిదాలో అచ్చమైన తెలంగాణా పిల్లలా సహజంగా నటించింది.దానికి డబ్బింగ్ కూడా తనే చెప్పుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.ఫిదా సూపర్ హిట్ అవ్వడంలో సాయిపల్లవి యాక్టింగ్ వల్లనే అని బల్ల గుద్ది చెప్పొచ్చు.వీటన్నింటి కంటే ముందు సాయి పల్లవి మంచి డ్యాన్సర్.,డాక్టర్.మన తెలుగు  డ్యాన్స్ ప్రోగ్రాం ఢీలో  తను పార్టిసిపేట్ చేసింది.ఆ వీడియోలు కూడా మనం చూసాం.ఇప్పుడు తనలో మరో యాంగిల్ ని మీకు పరిచయం చేస్తున్నాం.యాక్టర్,డ్యాన్సర్,డాక్టరే కాదు.సాయి పల్లవి సింగర్ కూడా.. పాట పాడుతుచంటి పిల్లాడిని పడుకోపెడ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మీరు కూడా చూడండి.

 

 

Comments

comments

Share this post

scroll to top