సాయిపల్లవి గురించి 7 ఆసక్తికర విషయాలు.!

భానుమతి ఒక్కటే పీస్..రెండు కులాలు ,రెండు మతాలు హైబ్రీడ్ పిల్ల…ఒకే ఒక సినిమాతో జనాల్ని ఫిదా చేసేసింది గదా..ప్రతి హీరోయిన్ కూడా కోరుకుంటుంది తన పేరుతో కాకుండా పాత్రతో గుర్తుండిపోయేలా ఒక క్యారెక్టర్ దొరికితే చాలు అని..కానీ సాయి పల్లవి కి మాత్రం తన కోసమే పుట్టాయేమో అన్నట్టు దొరుకుతున్నాయి పాత్రలు..ప్రేమమ్ లో మలర్ క్యారెక్టర్ కూడా అంతే…మళయాలం అర్దం కాకపోయినా కూడా మలరే మలరే అంటూ ఊగిపోయారు కుర్రాళ్లు..అందులో సాయిపల్లవిని..నిజం చెప్పాలంటే కుర్రాళ్లకే కాదు అమ్మాయిలకు కూడా బాగా నచ్చేసింది మలర్..ఎంతలా అంటే తెలుగు ప్రేమమ్ లో మలర్ పాత్రకి స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ని తీసుకుంటే ఆ క్యారెక్టర్ కి సాయిపల్లవి తప్ప ఎవరూ సూట్ కారు అని అపోజ్ చేసేంతలా…ఫిదా హీరోయిన్ సాయిపల్లవి అలియాస్ భానుమతి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు..

  • సాయిపల్లవి పుట్టింది కోటగిరిలో ..మన తెలుగమ్మాయే అనుకుంటున్నారా..ఇది మన దగ్గర కోటగిరి కాదు లెండి తమిళనాడులోని కోటగిరి..పెరిగింది మాత్రం కోయంబత్తూరులో..
  • చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు కదా..సాయిపల్లవి మాత్రం డాక్టర్ అయింది,యాక్టర్ కూడా అయింది..ఎమ్బిబిఎస్ పూర్తి చేసిన సాయిపల్లవికి కార్డియాలజిస్ట్ అవ్వడమే లక్ష్యం అందుకే చదువుని నిర్లక్ష్యం చేయకుండా తనకు నచ్చిన పాత్రలే చేస్తుంది..స్టార్ హీరోల ఛాన్స్ లు కూడా వద్దనుకుంటుంది.
  • ప్రేమమ్ సినిమా సాయి పల్లవి ఫస్ట్ మూవీ అనుకుంటారు కానీ హీరోయిన్ కాకముంది సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసింది..ధామ్ ధూమ్ అనే తమిళ సినిమాలో కంగనా కి  ఫ్రెండ్ గా చేసింది.
  • సౌతిండియా టివి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో పాపులర్ షో ఢీలో పార్టిసిపేట్ చేసింది సాయిపల్లవి..ఆ షోలో సాయిపల్లవి చేసిన డ్యాన్స్ వీడియోస్ ఇప్పటికీ యూ ట్యూబ్ లో చాలా పాపులర్..ఆ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ చూసిన సమంతా అప్పుడే చెప్పింది నువ్ హీరోయిన్ అవుతావని…ఢి షోలో..ఫిదా,ప్రేమమ్ సినిమాలో డ్యాన్స్ తో అదరగొట్టిన సాయిపల్లవి గురువులు ఎవరో తెలుసా ఐశ్వర్యరాయ్,మాధురీ దీక్షిత్..టీవిల్లో వీరి డ్యాన్స్ చూస్తూనే తాను డ్యాన్స్ నేర్చుకుందట
  • సాధారణంగా ముఖం నిండా మెటిమలున్న అమ్మాయిలు కొంచెం ఇబ్బందిపడుతుంటారు తాము అందంగా ఉండమని..సాయిపల్లవి కూడా తన స్కిన్ టోన్ బాగోదని ఇబ్బంది పడుతుంటే డైరెక్టరే ధైర్యం చెప్పారట..ఇప్పుడు మొటిమలున్న అమ్మాయిలకు సాయిపల్లవి ఒక రోల్ మోడల్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు..
  • హీరోయిన్ కాకముందు యాడ్స్ చేసేది  సాయిపల్లవి. డైరెక్టర్ అల్పోన్స్ పుతరన్ సీరియస్ గా చెప్పారట యాడ్స్ మానేయమని..అతనే హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారట అతనే ప్రేమమ్ డైరెక్టర్..డేట్స్ కోసం కాల్స్ చేస్తున్న అల్పోన్స్ ని ఎవరో అబ్బాయి ప్రపోజ్ చేయడానికి కాల్ చేస్తున్నాడనుకుని ఇగ్నోర్ చేసిందట.
  • సాయిపల్లవి తమిళియన్ అయినప్పటికీ ఓనం పండుగ మీదున్న ఇష్టంతో ఆ పండుగ జరుపుకుంటుంది ..అంతేకాదు ఈ పండుగ కోసం ముగ్గులు కూడా నేర్చుకుందట…ఇవండీ సాయిపల్లవి గురించిన విషయాలు..

 

Comments

comments

Share this post

scroll to top