రౌడీ బేబీ వీడియో సాంగ్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి :

సోషల్ మీడియా లో ఎక్కడ చుసిన ఇప్పుడు సాయి పల్లవి మీదనే పోస్ట్స్, ఇటీవలే మారీ-2 సినిమా లోని రౌడీ బేబీ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో వదిలారు. ఆ సాంగ్ విడుదల అయిన క్షణము నుండి ఆ సాంగ్ కి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయ్.

క్రేజ్ అమ్మ క్రేజ్ :

సాయి పల్లవి డాన్స్ కి మాములు క్రేజ్ లేదు, ఫిదా మూవీ లో సాయి పల్లవి చేసిన వచ్చిందే సాంగ్ సౌత్ ఇండియా లోనే యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ పొందిన వీడియో గా రికార్డు సృష్టించింది. ఆ తరువాత నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఎమ్.సి.ఏ చిత్రం లోని ఏవండోయ్ నాని గారు సాంగ్ కి 92 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి, ఫిదా లో వచ్చిందే సాంగ్ కు 174 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక విడుదల అయిన 5 రోజుల్లోనే దాదాపు 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి మారీ-2 లోని రౌడీ బేబీ సాంగ్ కు. సాయి పల్లవి వేసే స్టెప్స్ కి జనాలు ఫిదా అయిపోతున్నారు, సాయి పల్లవి చేసిన ఈ సాంగ్స్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆ పాటల్లో సాయి పల్లవి వేసిన స్టెప్స్ ఏ ముఖ్య కారణం. ఏవండోయ్ నాని గారు సాంగ్ లో సాయి పల్లవి వేసిన డాన్స్ వల్లనే ఆ సాంగ్ అంత ఫేమస్ అయ్యింది, స్వతహాగా మంచి డాన్సర్ కావడం తో సాయి పల్లవి చాలా కష్ట తరమైన స్టెప్స్ కూడా సునాయాసంగా వేస్తుంది.

సాంగ్స్ అంటే చాలు, ఎగబడిపోతున్నారు అబ్బా :

గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె సాంగ్ అయితే లిరికల్ + ఎడిటెడ్ + వీడియో సాంగ్ మూడు కలిపితే 300 మిలియన్ వ్యూస్ వరకు వచ్చాయి, RX-100 సినిమాలోని పిల్లా రా వీడియో సాంగ్ అయితే 90 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించింది. టాక్సీవాలా మూవీ లోని మాటే వినదుగ సాంగ్, హుషారు మూవీ లోని ఉండిపోరాదే సాంగ్ కూడా జనాల్ని ఆకట్టుకున్నాయి. రానున్న కాలంలో మన సౌత్ లో యూట్యూబ్ లో సాంగ్స్ ని చూసే వారి సంఖ్యా ఇంకా పెరగనుంది.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top