వి.వి.వినాయక్ దర్శకత్వంలో “సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి” నటించిన “ఇంటెలిజెంట్” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Krishna

Movie Title (చిత్రం): ఇంటెలిజెంట్ (Intelligent)

Cast & Crew:

 • నటీనటులు: సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, దేవ్ గిల్, వినీత్ కుమార్ తదితరులు
 • సంగీతం: యస్.యస్. థమన్
 • నిర్మాత: సి.కళ్యాణ్
 • దర్శకత్వం: వి వి వినాయక్

Story:

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఈ సినిమా కథ నడుస్తుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్న తేజ ఒక గ్యాంగ్ వల్ల డిస్టర్బ్ అవుతాడు. ఆ గ్యాంగ్ ఏంటి? దాని వెనుక ఉన్నది ఎవరు అనేదే తరువాతి సినిమా.

Review:

సాయి ధర్మ తేజ “తేజ” గా తరువాత “ధర్మా భాయ్” గా ఒకే పాత్రలో పలు వేరియేషన్స్ ని కనబర్చాడు. ఓవరాల్ గా చెప్పాలంటే తేజ నటన ఈ సినిమాకు ప్రాణం. లావణ్య త్రిపాఠి గ్లామరస్ గా కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆశిష్ విద్యార్థి, సాయాజి షిండే, తాగుబోతు రమేష్ లాంటి వాళ్ళు తమకు తగ్గట్టుగా పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయారు.ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమాలో బాగా ఉంటాయి. కానీ, లైటింగ్ వర్క్ అంతా చూస్తుంటే ఎక్కడో అదుర్స్ సినిమా నాటి విషువల్స్ కనిపిస్తూ ఉంటాయి. యస్ యస్ థమన్ పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. యస్ వి విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ మాములుగా ఉంది. ఆఫ్ కోర్స్ రిచ్ గా కూడా ఉంది. పంచ్ డైలాగులు కామెడీ సీన్స్ లో బాగా పేలాయి.సినిమా కథ , కథనం పరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేదు. మాములు వి వి వినాయక్ సినిమా లా ఉంది ఇది కూడా. స్నేక్ గ్యాంగ్ అనే టాపిక్ మీద ఇంటరెస్టింగ్ గా మొదలుపెట్టిన వివి వినాయక్, తరువాత ఎంటర్టైనింగ్ అంశాల పైనే ఎక్కువ దృష్టి సారించాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ నుండి బెస్ట్ ఎలెమెంట్స్ , ఫైట్స్, డాన్స్ ని ఉపయోగించుకున్నారు. రొటీన్ గానే వెళ్లిపోతోంది అనుకుంటున్న ఈ సినిమాలో ట్విస్టులు ప్రవేశ పెట్టి జాగ్రత్త పడ్డారు.

Plus Points:

 • సాయి ధరమ్ తేజ్ ఆక్షన్
 • లావణ్య గ్లామర్
 • కామెడీ
 • ట్విస్ట్స్
 • ఫైట్స్
 • డాన్స్
 • పంచ్ డైలాగ్స్

Minus Points:

 • రొటీన్ స్టోరీ
 • సినిమాటోగ్రఫీ

Final Verdict:

రొటీన్ బట్ ఎంటర్టైనింగ్

AP2TG Rating: 2.75 / 5

Trailer:

Comments

comments